Begin typing your search above and press return to search.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు!?
By: Tupaki Desk | 24 Jan 2019 4:39 AM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్మధనం ప్రారంభమైంది. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది. ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ లో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న అధిష్టానం రాష్ట్రాల్లో కూడా ఆ పని చేపట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనికి నాంది ప్రస్థానంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ని పూర్తి ప్రక్షాళన చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీం తోనే లోక్ సభ బరిలో కూడా దిగడం అంత మంచిది కాదని అధిష్టానం భావిస్తోంది. దీంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సహా మొత్తం కార్యవర్గాన్ని మార్చాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలైన సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను అధ్యక్షుడిగా నియమిస్తే 8 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతున్నారు. ఇంతకుముందు కూడా తనను పీసీసీ అధ్యక్షుడిగా చేయ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ఆయన స్థానంలో మరొకరిని అధ్యక్షుడిగా నియమిస్తారని అంటున్నారు. అయితే ఈసారి పిసిసి అధ్యక్షుడిగా మగవారిని కాకుండా మహిళలకు అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అదే జరిగితే పీసీసీ రేసులో మాజీ మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డిలకు పీసీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నాయి. శాసనసభా పక్షనేతగా భట్టి విక్రమార్క కు అవకాశం ఇవ్వడంతో పిసిసి అధ్యక్ష పదవిని మహిళా నేతలకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడంతో భవిష్యత్ లో మహిళ నాయకురాళ్లకు భారీ అవకాశాలుంటాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.