తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రకు బ్రేకులు పడే అవకాశం ఉంది. ఈనెల 26 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు గతంలో ఆయన ప్రకటించారు. కానీ ఇదే సమయంలో అధిష్టానం నిర్వహించే 'హాథ్ సే హాథ్ అభియాన్' మొదలు కానుంది. ఇందులో విభేదాలు పక్కనబెట్టి పార్టీ నాయకులందరూ పాల్గొనాలనే రూల్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తప్పనిసరిగా పాల్గొనాలి. దీంతో ఆయన వ్యక్తిగతంగా నిర్వహించాలనుకున్న పాదయాత్రను రద్దు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి నిర్వహించే పాదయాత్రకు అనుమతి లేదని ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇంకోవైపు సీనియర్లు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఎలాగూ సపోర్టు లేదు. ఇలాంటి సమయంలో పీసీసీ చీఫ్ పాదయాత్ర చేపడుతారా..? లేక మానుకుంటారా..? అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా మాణిక్కం ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు థాక్రే వచ్చారు. ఇంతకాలం ఠాగూర్ రేవంత్ కు ఫుల్ సపోర్టుగా ఉన్నారు. ఇప్పడు థాకూర్ అలాగే ఉంటారా..? అనేది సస్పెన్స్ గా మారింది.
వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ నిర్వహించిన పాదయాత్ర స్ఫూర్తితో 'హాథ్ సే హాథ్ అభియాన్' పేరుతో పాదయాత్ర నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం తెలంగాణలో కూడా నిర్వహిస్తారు. ఇందులో విభేదాలు పక్కనబెట్టి పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. హైదరాబాద్ సిటీ సెగ్మెంట్లను మినహాయించి మిగతా 99 నియోజకవర్గాల్లో 126 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. రోజుకు 18 కిలోమీటర్లు సాగే ఇందులో ఆయా జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. 'హాథ్ సే హాథ్ అభియాన్' ను తొలుత జోగులాంబ జిల్లాలో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ భద్రాచలం నుంచి మొదలు పెట్టాలని అక్కడి ఎమ్మెల్యే పోదెం వీరయ్య కోరారు. ఆయన కోరిక మేరకు అక్కడి నుంచే ప్రారంభించాలని అనుకుంటున్నారు. అయితే వైఎస్ హయాంలో చేపట్టిన చేవేళ్లను సెంటిమెంట్ గా తీసుకోవాలని కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికి భద్రాచలం ఫిక్స్ చేశారు.
'హాథ్ సే హాథ్ అభియాన్' అభియాన్ రాష్ట్రంలో సక్సెస్ చేసే విధంగా ఇక్కడి కమిటీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలోనే పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సొంతంగా నిర్వహించాలనుకున్న పాదయాత్రకు బ్రేకులు పడే అవకాశం ఉంది. అంతకుముందు ఈనెల 26 నుంచి పాదయాత్ర చేపట్టాలని అనుకున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజల్లోకి వెళ్లి పార్టీ పటిష్టత పెంచాలన్న ఆలోచన ఉందని అప్పట్లో అన్నారు. కానీ ఇప్పుడు అధిష్టానం 'హాథ్ సే హాథ్ అభియాన్' బాధ్యత అప్పగించడంతో వ్యక్తిగత పాదయాత్ర కంటే అధిష్టానం సూచలు పాటించాల్సి ఉంటుంది.
ఇక రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా నిర్వహించాలనుకున్న పాదయాత్రకు అనుమతి లేదని ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకమైనప్పటి నుంచి రేవంత్ కు మహేశ్వర్ రెడ్డి సపోర్టు ఇస్తూ వస్తున్నారు. అయితే కొన్ని విషయాలపై ఆయనను విభేదించారు. అప్పటి నుంచి ఆయనను మార్చాలని ఏలేటి డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహించే పాదయాత్రకు అనుమతి లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్యంరావు థాక్రే వచ్చారు. అంతకుముందు ఠాగూర్ రేవంత్ కు సపోర్టుగా ఉన్నారు. సీనియర్లు రేవంత్ పై అసంతృప్తి వ్యక్తం చేసినా ఆయన వెనుకేసుకొచ్చారు. కానీ ఇప్పుడు థాగూర్ రేవంత్ తో ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి. ఇప్పటికే సీనియర్లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు థాక్రే వారి పక్షాన ఉంటే పీసీసీ చీఫ్ కు కష్టకాలమేనని అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి తన పాదయాత్రను రద్దు చేసుకోవడమే బెటటరని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.