Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: రేవంత్ రెడ్డి అరెస్ట్

By:  Tupaki Desk   |   27 Dec 2021 11:36 AM GMT
బ్రేకింగ్: రేవంత్ రెడ్డి అరెస్ట్
X
కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ పెట్టి రైతుల సమస్యలను పరిష్కరిస్తానన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు షాకిచ్చారు. ఇంట్లో నుంచి ఎవరూ అడుగు బయట పెట్టకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి బయటకు వచ్చి గజ్వేల్ వెళ్లడానికి ప్రయత్నించినా పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి భారీ బందోబస్తుతో ఆయన ఇంటివద్ద పోలీసులను మోహరించారు. పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. అటు కాంగ్రెస్ నాయకులపై పోలీసులు లాఠీలు ఝలిపించి రేవంత్ ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ ను గద్దె దించేంతవరకూ పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక ఎక్కడైతే కాంగ్రెస్ నేతలు రచ్చబండ నిర్వహించాలనుకున్నారో అక్కడే టీఆర్ఎస్ నేతలు టెంట్ వేసేశారు. కాంగ్రెస్ నేతలను ఏర్పాట్లు చేసుకునే సమయంలోనే అడ్డుకున్నారు. అయితే ఎక్కడైనా నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు బయలు దేరారు.

ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో నూట యాభై ఎకరాల్లో వరి పండిస్తున్నారని.. కానీ ఆయనే రైతులను వరి వేయవద్దని అంటున్నారని.. ఈ విషయాన్ని తాము బయట పెడుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.