Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం: దిల్లీలో తెలంగాణ డే

By:  Tupaki Desk   |   19 Nov 2015 7:15 AM GMT
ఫస్ట్ టైం: దిల్లీలో తెలంగాణ డే
X
తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని మరో మూడు రోజుల్లో ఢిల్లీలో నిర్వహించబోతున్నారు. ఎంతో కీలకమైన వేడుకలకు రాష్ట్రంలో ఏమాత్రం హడావుడి లేకపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా...? నిజమే హడావుడి లేకపోవడం నిజమే.. వేడుకల జరుపుతుండడం కూడా నిజమే. అయితే.. అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఇవి రెగ్యులర్ వేడుకలు కాకపోవడంతో రాష్ట్రంలో హడావుడిలేకపోయినా ఢిల్లీలో మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 22వ తేదీన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ లో తెలంగాణ రాష్ట్ర దినోత్సవం నిర్వహించబోతున్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక వాణిజ్య ప్రదర్శనలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఎగ్జిబిషన్‌ లో పాల్గొనే రాష్ర్టాలకు ఒక్కో రోజు ఒక్కో రాష్ర్టం తమ రాష్ట్ర దినోత్సవం జరుపుకొనే అవకాశం ఇస్తారు. అందులో భాగంగానే తెలంగాణ దినోత్సవాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర దినోత్సవం జరుపుతారు. ప్రగతి మైదాన్‌ లో 22వ తేదీ సాయంత్రం జయ జయహే తెలంగాణ - ఒగ్గుడోలు - ఖవ్వాలి - పేరిణి శివతాండవం ప్రదర్శించనున్నారు. తెలంగాణ నుంచి పలువురు మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా ఢిల్లీలో తెలంగాణ దినోత్సవం నిర్వహించడం ఇదే ప్రథమం.