Begin typing your search above and press return to search.
ఐపీఎల్ ఫైనల్ పాసుల కోసం ఏకంగా అధికారిక లేఖ రాసేశాడు
By: Tupaki Desk | 13 May 2019 6:26 AM GMTఐపీఎల్ క్రేజ్ ఎంత ఉందన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. తాజా ఐపీఎల్ సీజన్ ముగింపు అయిన ఫైనల్ మ్యాచ్ పాసుల కోసం ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారి ఒకరు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా ఉంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు 300 పాసులు తమకు కేటాయించాల్సిందిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా ఎక్సైజ్ అధికారి ఒకరు నేరుగా లేఖ రాసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఐపీఎల్ టికెట్లు దొరక్క తెగ యాతన పడుతున్న వేళ.. 300 పాసుల కోసం ఒక ప్రభుత్వ అధికారి లేఖ రాసిన వైనం బయటకు వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు.
ఒకపక్క ఐపీఎల్ ఫైనల్ పాసుల విషయంలో ఇప్పటికే పెద్ద రచ్చ నడుస్తోంది. బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పాసులు అమ్ముకుంటున్నారన్న ఆరోపణల బలంగా వినిపిస్తోంది. ఇలాంటివేళ ఎక్పైజ్ అధికారి ప్రదీప్ రావు ఈ నెల 9న హైదరాబాద్ క్రికెట్ క్లబ్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమకు అవసరమైన 300 టికెట్లలో 250 సాధారణ పాస్ లు కావాలని.. ఒక యాభై పాసులు కార్పొరేట్ బాక్స్ టికెట్లు ఇవ్వాలని కోరిన వైనంపై ముక్కున వేలేసుకుంటున్నారు.
తమ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు తాము ఇవ్వాల్సి ఉన్నందున.. తమకీ పాసులు ఇవ్వాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ లేఖలో సదరు అధికారి సంతకం చేయటమే కాదు.. శాఖ స్టాంప్.. అధికారిక సీటు వేసి పంపటం.. అది కాస్తా సోషల్ మీడియాలోకి రావటంతో ఇప్పుడీ వ్యవహారం వైరల్ గా మారింది.