Begin typing your search above and press return to search.

కేసీఆర్ డ్రీం ప్రాజెక్టు వ్యయం పెరుగుతోంది

By:  Tupaki Desk   |   3 Oct 2020 5:30 PM GMT
కేసీఆర్ డ్రీం ప్రాజెక్టు వ్యయం పెరుగుతోంది
X
చేతిలో అధికారం ఉన్నా కొన్ని పనులు అనుకున్నంతనే జరిగిపోవు. అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మినహాయింపు కాదు. తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించటం.. అధికారాన్నిసొంతం చేసుకోవటం చాలా పాత విషయాలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించేందుకు సచివాలయంలోని సీఎంవోకు వెళ్లిన ఆయనకు.. అక్కడి వాతావరణం పరిస్థితులు నచ్చలేదు. ఆయన ఎంతో నమ్మే వాస్తు కూడా సరిగా లేదన్న భావనకు ఆయన వచ్చినట్లు చెప్పారు.

అంతే.. అప్పటి నుంచి సచివాలయానికి వెళ్లటాన్ని బంద్ చేసిన ఆయన..కొత్త సచివాలయం కల కనటం షురూ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన కలను నెరవేర్చుకోవటానికి గడిచిన ఆరేళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. ఈ మధ్యనే సచివాలయాన్ని విజయవంతంగా కూల్చేయించిన ఆయన.. కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. రూ.400 కోట్ల ఖర్చుతో సరికొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పటం తెలిసిందే.

అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త సచివాలయ వ్యయం పెరిగినట్లుగా చెబుతున్నారు. మొదట్లో అనుకున్న దానికి మరో రూ.200 కోట్లకు పైనే అదనపు భారం పడనున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుమతికి సంబంధించిన సవరణ ఆమోద పత్రంలో తాజాగా పెరిగిన వ్యయం పెరుగుదల విషయాన్ని ప్రస్తావించారు. ఏడాది వ్యవధిలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఖర్చు పెరగటమే కాదు.. భవన బిల్డప్ ఏరియాను సైతం మొదట అనుకున్న దాని కంటే కూడా 3835 చదరపు మీటర్ల మేర పెరిగినట్లుగా తెలుస్తోంది. తొలుత ప్రతిపాదనల ప్రకారం సచివాలయ కాంప్లెక్స్ సైట్ ఏరియా 26.29 ఎకరాలు కాగా.. తాజాగా మారిన ప్రతిపాదనలతో అది కాస్తా 28.05 ఎకరాలుగా మారింది. దీంతో.. ప్రతిపాదిన సచివాలయానికి అనుకొని ఉన్న భవనాల్ని.. రోడ్లను కొంతమేర తొలగించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.