Begin typing your search above and press return to search.

కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

By:  Tupaki Desk   |   8 Sept 2019 5:28 PM IST
కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు
X
మేనల్లుడు హరీష్ రావును పక్కనపెట్టి కొడుకు కేటీఆర్ కే కేసీఆర్ అందలం ఎక్కించారనే అపవాదు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన వేళ.. కొత్త కేబినెట్ విస్తరణతో ఆ అనుమానాలను పటాపంచలు చేశారు కేసీఆర్.

తాజాగా ఆదివారం సాయంత్రం మంత్రివర్గం విస్తరణలో మేనల్లుడు హరీష్ రావుకు కేసీఆర్ అగ్రతాంబూలం ఇచ్చాడు. మొదట హరీష్ రావుతో ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించడం విశేషం. మొదట ఎవరిని పిలుస్తారని ఉత్కంఠగా ఎదురుచూసిన వేదిక కింద ఉన్న సభ్యులు, టీవీలో చూస్తున్న జనాలకు హరీష్ అనిపేరు పిలవగానే కేరింతలు, అరుపులు, చప్పట్లతో వేదిక దద్దరిల్లింది.

ఇక మంత్రిగా మొదట ప్రమాణం చేసిన హరీష్ రావుకు కేసీఆర్ పెద్ద బాధ్యతను అప్పగించారు. తాజాగా కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని నడిపించే కీలకమైన ఆర్థికశాఖను కేసీఆర్ తన అల్లుడు హరీష్ చేతిలో పెట్టడం విశేషం.

గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టులను పరుగులు పెట్టించిన హరీష్ కు ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన 'ఆర్థికశాఖను' కేసీఆర్ కేటాయించడం విశేషంగా మారింది.. కేటీఆర్ కు పరిశ్రమలు - పురపాలక - ఐటీ శాఖలు పాతవాటినే కేటాయించారు.

*కొత్త మంత్రుల శాఖలు ఇవే..

హరీష్ రావు కు - ఆర్థికశాఖ
కేటీఆర్- పరిశ్రమలు - పురపాలక - ఐటీ శాఖలు
సబితా ఇంద్రారెడ్డి - విద్యాశాక
గంగుల కమలాకర్ - పౌరసరఫరాలు - బీసీ సంక్షేమం
సత్యవతి రాథోడ్ - గిరిజన - మహిళా - శిశు సంక్షేమం
పువ్వాడ అజయ్ - రవాణా శాఖ