Begin typing your search above and press return to search.

కేసీఆర్ కూడా ‘విలీన బాట’..బీజేపీకి పోటీగా 3 రోజులు నిర్వహణ?

By:  Tupaki Desk   |   3 Sep 2022 3:25 PM GMT
కేసీఆర్ కూడా ‘విలీన బాట’..బీజేపీకి పోటీగా 3 రోజులు నిర్వహణ?
X
కేంద్రంలోని బీజేపీ పెద్దలు తెలంగాణపై దండయాత్ర చేస్తూ సెప్టెంబర్ 17ను టార్గెట్ చేసి ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు కూడా తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుతవ్ం చేయలేని పనిని.. కేంద్రం అధికారికంగా చేస్తుండడంతో కేసీఆర్ సర్కార్ డిఫెన్స్ లో పడింది.అందుకే కేబినెట్ సమావేశం పెట్టిన కేసీఆర్ ‘తెలంగాణ విలీన దినోత్సవ వజ్రోత్సవాలు’ పేరిట మూడు రోజులు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు శనివారం కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

ఈ సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ రాష్ట్రం దేశంలో విలీనమై 75 ఏళ్లు అవుతుంది. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరిట ప్రారంభవేడుకలను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. పోడు భూముల అంశం, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, విద్యుత్ బకాయిలు సహా వివిధ అంశాల్లో కేంద్రం వైఖరి గురించి కూడా సమావేశంలో చర్చించారు. సీబీఐకి రాష్ట్రంలో అనుమతి నిరాకరణ వంటి పలు అంశాలపై కూడా చర్చించారు. మున్సిపల్ యాక్ట్, పరిశ్రమల యాక్ట్ , విద్యాశాఖ యాక్ట్ సవరణలపై కూడా కేబినెట్ లో చర్చించారు.

అసెంబ్లీ వేదికగానే బీజేపీని, కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలని.. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు సిద్ధం చేస్తున్నారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తున్నారు.

ప్రధానంగా బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాలకు ప్రత్యామ్మాయంగానే కేసీఆర్ ఈ విలీన వజ్రోత్సవాల పేరిట ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి ప్రతీసారి సెప్టెంబర్ 17 ఆయుధం ఇవ్వకుండా చేసేందుకే అధికారికంగా ఉత్సవాల నిర్వహణకు రెడీ అయ్యారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకే ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.