Begin typing your search above and press return to search.
కేసీఆర్ జైత్రయాత్రను ఎంపీటీసీలు అడ్డుకుంటారా?
By: Tupaki Desk | 4 Dec 2015 9:08 AM GMT తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆశపడుతున్న నేతలకు ఇప్పుడు కొత్త భయం మొదలైంది. స్థానిక కోటాలో టిక్కెట్లు తెచ్చుకున్నా ఓట్లేయాల్సినవారిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమకు మద్దతు ఇస్తారో లేదో అన్న భయం వారిని వెంటాడుతోంది. దానికి కారణం... ఎంపీటీసీల సంఘం.. ''ఓట్లు మావే.. సీట్లు మావే'' అంటూ కేండిడేట్లను నిలబెట్టడమే. ఈ తాజా పరిణామం ఒక్కసారిగా కుదుపుతెచ్చింది.
తెలంగాణాలో అధికారపార్టీతో పాటు ఇతర విపక్షపార్టీలకు తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 6441మంది ఎంపీటీసీలున్నారు. ఇందులో టీఆ ర్ఎస్ - టీడీపీ - కాంగ్రెస్ - బీజేపీ - సీపీఐ - సీపీఎం పార్టీలకు చెందిన ఎంపీటీసీలున్నారు. ప్రజలు తమను నేరుగా ఎన్నుకున్నా ఉత్సవవిగ్రహాలుగా తమ పరిస్థితి మారిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెవరో పోటీ చేస్తుంటే వారికి తాము ఓటేస్తున్నామని... ఈసారి అలా కాకుండా ఎంపీటీసీల బరిలో దిగుతారని... ఇందులో అన్ని పార్టీల వారికి అవకాశం కల్పిస్తున్నామని తెలంగాణ ఎంపీటీసీల ఫోరం ప్రకటించింది. అన్ని జిల్లాలలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటీ చేసేందుకు అభ్యర్థులకు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకరల్ అధ్యక్షతన రాష్ట్ర ఫోరం సమావేశాన్ని నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు కూడా. తమకు ఎంపీటీసీలు - ఎంపీపీలే కాకుండా... జడ్పీటీసీలు - కార్పొరేటర్లు - కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో మద్ధతు ఇస్తారని వారు చెప్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పట్టభద్రుడు అభ్యర్థిగా నిలబెడుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎందుకు టిక్కెట్లివ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఓట్లలో మేజర్ షేర్ ఉన్న ఎంపీటీసీల చీలిక ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. అయితే... ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రధాన అభ్యర్థులను భయపెట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందాలన్న ఆలోచన కూడా ఇందులో ఉండొచ్చన్న విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి అన్ని ఎన్నికల్లో జైత్రయాత్ర చేస్తూ.. తాజాగా వరంగల్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆరెస్ 12 ఎమ్మెల్సీ స్థానాలనూ గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న పరిస్థితుల్లో ఆయన స్పీడుకు ఎంపీటీసీలు బ్రేకులు వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.