Begin typing your search above and press return to search.

హాట్ బిజినెస్: గులాబీ ఎమ్మెల్యేల యాపారం..

By:  Tupaki Desk   |   18 Oct 2019 12:04 PM GMT
హాట్ బిజినెస్: గులాబీ ఎమ్మెల్యేల యాపారం..
X
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు భూతద్దం పెట్టి వెతికినా దొరకడం లేదట.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక.. పార్లమెంట్ ఎన్నికల వేళ హల్ చల్ చేసిన నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరూ జిల్లాలో కనిపించడం లేదట.. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టి గెలిచిన వీరంతా ఇప్పుడు ఆ ఖర్చులు రాబట్టుకునే పనిలో పడ్డారట.. ఇందుకు సైడ్ దందాలు మొదలుపెట్టినట్టు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ లో మొత్తం 9 అసెంబ్లీ సీట్లలో 8 టీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ గెలిచింది. ఎల్లారెడ్డిలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కారెక్కేశాడు... ఇందులో పోచారం స్పీకర్ కాగా.. ఒకరు మంత్రి, ఒకరికి విప్ పదవి దక్కింది.

ఇప్పుడు వీరంతా అధికారాన్ని ఎంజాయ్ చేస్తూనే వ్యాపారాల్లో రాణిస్తున్నారట.. రియల్ ఎస్టేట్స్, ఇతర వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు బిజీ అయిపోయారట.. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి, కలవడానికి ప్రయత్నించినా అసలు జిల్లాలోనే ఎవరూ ఉండడం లేదన్న టాక్ నడుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు ఏదైనా అభివృద్ధి, షాపుల ఓపెనింగ్ లకు అలా వస్తూ ఇలా వెళ్లిపోతున్నారట.. ఓ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల నుంచి నియోజకవర్గానికి ముఖం చాటేశాడట..విదేశాల్లోని తన వ్యాపారాల్లో సదురు ఎమ్మెల్యే బిజీ అయ్యారనే టాక్ నడుస్తోంది.

దీంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి పడకేస్తోంది. అభివృద్ధి పనులకు నిధులు లేక.. పనులు మధ్యలో ఆగిపోవడం.. నియోజకవర్గ నిధులు తగ్గిపోవడంతో ప్రత్యామ్మాయం వైపు ఎమ్మెల్యేలు దృష్టిపెట్టారనే టాక్ నడుస్తోంది. దీంతో కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు రెండోసారి గెలిచారు. ఇందుకోసం గత ఎన్నికల కంటే రెట్టింపు ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో నిధుల కొరతతో పనులు సాగక అప్పులు పెరిగిపోయి ఖర్చులు రాబట్టుకునేందు బిజినెస్ మ్యాన్లు గా మారి నియోజకవర్గాలకు దూరంగా వ్యాపారులు చేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది కాంట్రాక్టర్లు, బిల్డర్లుగా మారి సొంత వ్యాపారాలు చూసుకుంటూ నియోజకవర్గాలకు దూరంగా ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ప్రజలు విమర్శిస్తున్నారు..వివిధ పనుల కోసం ప్రజలు ఎమ్మెల్యేల కోసం, కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగుతున్నా పనులు కాక ఆందోళన చెందుతున్నారట...