Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్‌ ను క‌లిసిన తెలంగాణ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   7 Nov 2019 7:57 AM GMT
ర‌జ‌నీకాంత్‌ ను క‌లిసిన తెలంగాణ ఎమ్మెల్యే
X
కోలీవుడ్ సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్‌ ను తెలంగాణ‌ లో అధికార టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే క‌లిసి ఆశీర్వ‌చ‌నం తీసుకున్నారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌ రెడ్డి ఆయ‌న భార్య అర్తి రెడ్డి తో క‌లిసి మ‌రీ ర‌జ‌నీకాంత్‌ ను చెన్నై లో ఆయ‌న ఇంట్లో క‌లిశారు. బుధవారం చెన్నై లోని రజినీ నివాసానికి వెళ్లిన రోహిత్‌ రెడ్డి దంప‌తులు ర‌జ‌నీకి పుష్ప గుచ్ఛం అందించారు. అనంతరం రజనీ ఆశీర్వాదం తీసుకున్నారు.

మ‌న‌ల‌ను ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నుకున్న ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని ర‌జ‌నీ సూచించిన‌ట్టు రోహిత్‌ రెడ్డి తెలిపారు. ఇక సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకి కోట్ల‌లో అభిమానులు ఉన్నార‌ని.. అందులో తాను కూడా ఒక‌డిని అని చెప్పిన రోహిత్‌ రెడ్డి ఈ భేటీ పూర్తి వ్య‌క్తిగ‌త‌మ‌ని చెప్పారు. ఇక ఫైలెట్‌ గా సేవ‌లు అందించిన రోహిత్ రెడ్డి చిన్న వ‌య‌స్సులోనే రాజ‌కీయాల్లో కి వ‌చ్చారు.

గతేడాది డిసెంబర్‌ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన రోహిత్‌ రెడ్డి, ఆ తర్వాత టీఆర్ఎస్‌ లో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో రోహిత్‌ రెడ్డి అప్ప‌టి మంత్రి మ‌హేంద‌ర్‌ రెడ్డి నే ఢీ కొట్టి సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ తో ఉన్న సాన్నిహిత్యం నేప‌థ్యం లో ఆయ‌న టీఆర్ఎస్‌ లో చేరిపోయారు. ఇక గతంలో కూడా రోహిత్‌ రెడ్డి పలు మార్లు రజనీకాంత్‌ను కలిశారు.