Begin typing your search above and press return to search.
మంత్రులకు పొంచి ఉన్న ‘గ్రేటర్’ గండం
By: Tupaki Desk | 27 Nov 2020 2:30 AM GMTఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే సామెతలాగ తయారైంది మంత్రుల వ్యవహారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో సెంచిరీ దాటాలన్నది టీఆర్ఎస్ టార్గెట్. మరి టార్గెట్ దాటుతారో లేదో తెలీదు కానీ సెంచిరీ దాటించేందుకు కేసీయార్ మంత్రులకు గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్ధులను గెలిపించే బాధ్యత అప్పగించారు. దాంతో ఇపుడు తమకు అప్పగించిన డివిజన్లలో ఫెయిలైతే మెడపై కత్తి వేటు పడటం ఖాయమని టెన్షన్ పెరిగిపోతోంది మంత్రుల్లో.
మంత్రులకు ఇది కొత్తరకమైన సవాలనే చెప్పాలి. ఎందుకంటే తమ నియోజకవర్గాల్లో అంటే ఏ మూల ప్లస్ ఉంది ఎక్కడ మైనస్ ఉందో ఇట్టే చెప్పేయగలరు. కానీ చాలామందికి గ్రేటర్ డివిజన్ల వ్యవహారం కొత్తనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే మంత్రులు, ఎంఎల్ఏలు అవసరానికి హైదరాబాద్ కు వస్తారు, వెళ్లిపోతారంతే. అయితే ఇక్కడే మకాం వేసి డివిజన్లలో అభ్యర్ధులను గెలిపించాలంటే ముందు సదరు డివిజన్ పై వాళ్ళకు పట్టుండాలి కదా. అయితే కేసీయార్ ఇదేమీ ఆలోచించే ముచ్చట కనిపించలేదు. ఇన్చార్జీలుగా నియమించేసి ఫలితాలు చూపించమని ఆదేశించారంతే. మంచి ఫలితాలు వస్తే అందరికీ మంచిగానే ఉంటుంది. అదే రివర్సయితే మంత్రిపదవి గోవిందా గోవిందానే. అందుకనే తమ నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరుగుతున్నంతగా డివజిన్లలో తిరుగుతున్నారు మంత్రులు.
చిలుకనగర్ లో మంత్రి సత్యవతీ రాథోడ్, అంబర్ పేటలో నిరంజన్ రెడ్డి, సరూర్ నగర్లో జగదీఫ్ రెడ్డి తో పాటు ఇతర మంత్రులకు సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకునే కేసీయార్ బాధ్యతలు అప్పగించారు. బాద్యతలు అప్పగించగానే మంత్రులంతా డివజిన్లలో అభ్యర్ధులకు దగ్గరకు ఉర్రుక్కుంటా పరిగెత్తారు. అభ్యర్ధులకన్నా తెల్లవారి మంత్రులే డివిజన్లలో ప్రచారంలో కనబడుతున్నారంట.
దీనికి అదనంగా మంత్రుల్లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారనే విషయాన్ని కేసీయార్ ఇంటెలిజెన్స్ రిపోర్టు రోజూ తెప్పించుకుంటున్నారని తెలిసింది. దాంతో మంత్రులకు రాత్రుళ్ళు నిద్ర కరువైందని సమాచారం. ఇదే సమయంలో గ్రేటర్ సమరం ఏమో పోయిన లెక్క కాకుండా ఇపుడు బాగా టఫ్పయ్యింది. బీజేపీ రెచ్చిపోతోంది. ప్రచారానికి వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధులతో పాటు నేతలను కూడా జనాలు నిలదీస్తున్నారు. మరి ఈ నేపధ్యంలో ఎంతమంది మంత్రులపై గ్రేటర్ కత్తి పడుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.