Begin typing your search above and press return to search.
‘కోవాక్సీన్’ బిహార్ కోసమే .. మంత్రి కేటీఆర్ సెటైర్లు !
By: Tupaki Desk | 23 Oct 2020 5:45 AM GMTకరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టే సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో , రోజురోజుకి ఈ మహమ్మారి వ్యాధి వ్యాప్తి పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ మహమ్మారి వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే , అతి త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో లో హామీల వర్షం కురిపించింది. అందులో ఓ హామీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అదేమిటి అంటే .. రాష్ట్రంలో బీజేపీ పవర్‌లోకి వస్తే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఐసీఎంఆర్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వగానే ప్రజలకు ఉచితంగా అందిస్తామని ఆమె చెప్పుకొచ్చారు.
కరోనా వాక్సిన్ ను బీహారులో ఉచితంగా పంపిణీ చేస్తామని బిజెపి ఎన్నికల మానిపెస్టోల పెట్టడం ప్రస్తుతం వివాదం అవుతోంది.దీనిపై తెలంగాణ మంత్రి కెటిఆర్ తనదైన రీతిలో వ్యంగంగా స్పందించారు. ‘కేటీఆర్ గారూ ఇటీవల మీరు భారత్ బయోటెక్ ను సందర్శించినప్పుడు కరోనా టీకా అయిన ‘కోవాక్సీన్’ వేసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతగా జనంలో తిరుగుతున్నా మీకు ఏమీ కాలేదు. లేదా ఇంకేదైనా కారణం ఉందా’ అని ట్విట్టర్ లో ఒక నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకి మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను కోవాక్సీన్ టీకా వేసుకోలేదు. అది బిహార్ కోసమే రిజర్వ్ చేశారట’ అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.
ఇదే విధంగా దేశంలో పలువురు ప్రముఖులు బీజేపీ హామీ పై స్పందిస్తున్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు వ్యాక్సిన్ ను అందించరా అంటూ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ బీజేపీని ప్రశ్నించింది. బీజేపీకి ఓటేయని భారతీయులకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వరా అంటూ ఆప్ ట్విట్టర్ లో క్వశ్చన్ చేసింది. ‘వ్యాక్సిన్ కొనడానికి డబ్బులను బీజేపీ తన ఖజానా నుంచి ఇస్తోందా? ఒకవేళ ఆ డబ్బులను ప్రభుత్వ ట్రెజరీలో నుంచి ఇస్తున్నట్లయితే కేవలం బిహార్ కు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఎలా ఇస్తారు? దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ ఎందుకు డబ్బులు చెల్లించాలి?’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.