Begin typing your search above and press return to search.
చిటికెడు ఉప్పేసి పప్పంతా మాదే అంటే ఎలా
By: Tupaki Desk | 24 Sep 2020 11:10 AM GMTతెలంగాణ మంత్రి, డైనమిక్ లీడర్ హరీష్ రావు .. బీజేపీపై పదునైన విమర్శలతో రెచ్చిపోయారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చిటికెడు ఉప్పు వేసి పప్పంతా తమదే అన్న మాదిరి వ్యవహరిస్తున్నదని విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో పింఛన్ దారులకు రూ.11,700 కోట్లను అందిస్తుంటే, కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని, అయితే పింఛన్ దారుల నిధులు మొత్తం కేంద్రమే ఇస్తున్నట్లు బీజేపీ తప్పుడు ప్రచారం చేసుకోవడం దారుణం అని అన్నారు.
బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరంపల్లి కూడవెల్లిలో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో, మెదక్ జిల్లాలోని చేగుంట, నార్సింగ్ మండలాల్లో రైతులకు నూతన పట్టా పాస్ బుక్కులను పంపిణీ చేసిన సందర్భం గా ఆయన మాట్లాడారు. రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, ఆదుకోవాల్సిన కేంద్రం వ్యవసాయ బిల్లులు తెచ్చి అన్నదాతల నడ్డి విరుస్తుందన్నారు. విదేశాల నుంచి మొక్కజొన్నలు దిగుమతి చేసుకొని కోళ్ల దాణాకు ఉపయోగిస్తామని కేంద్రం చెబుతోందని, స్థానికంగా పండించిన మక్కలు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. గత యాసంగి లో ప్రభుత్వం కొనుగోలు చేసిన మక్కలే గోదాముల్లో మగ్గుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే , ఏ సమయంలో తన ఇంటి తలుపు తట్టినా నేను వస్తానని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని మంత్రి హరీశ్‌రావు వారికీ హామీ ఇచ్చారు.
తెలంగాణలో వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. రైతులు పండించే ప్రతి ఉత్పత్తికి మంచి ధర లభించేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.