Begin typing your search above and press return to search.
ఎడమ కాలికి చేయాల్సిన సర్జరీ కుడి కాలికి చేశారు.. టీ వైద్య మండలి సీరియస్ యాక్షన్
By: Tupaki Desk | 14 April 2023 9:16 AM GMTమరే ఇతర రంగానికి చెందిన వారు తప్పులు చేసినా.. అందుకు జరిగే నష్టం పరిమితంగా ఉంటుంది. కానీ.. వైద్యులు చేసే తప్పులకు మూల్యం భారీగా ఉంటుంది. ప్రాణాలు కూడా పోయే పరిస్థితి. అందుకే.. వైద్యులుగా వ్యవహరిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇందుకు భిన్నంగా హైదరాబాద్ కు చెందిన ప్రైవేటు వైద్యుడు ఒకరు చేసిన పనిపై తెలంగాణ వైద్య మండలి సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇంతకూ ఏం జరిగిందంటే..
హైదరాబాద్ లోని ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కరణ్ ఎం. పాటిల్ అనే ఆర్థోపెడిషియన్ ఉన్నారు. ఒక రోగి ఎడమ కాలికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే.. అందుకు బదులుగా కుడి కాలికి ఆపరేషన్ చేశారు. అయితే.. తన తప్పును రెండు రోజుల తర్వాత గుర్తించిన అతను.. మళ్లీ ఎడమ కాలికి సర్జరీ చేశారు. దీంతో.. సదరు బాధితుడు డీఎంహెచ్ వోకు కంప్లైంట్ చేశారు.
ఈ సందర్భంగా నియమించిన విచారణ కమిటీ సదరు వైద్యుడు చేసిన తప్పును గుర్తించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సీరియస్ గా స్పందించింది. డాక్టర్ కరణ్ ఎం పాటిల్ వైద్య డిగ్రీని ఆర్నెల్ల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని తాజాగా జారీ చేశారు. అతడి డిగ్రీని అధికారులకు సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
మరో ఉదంతంలో మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పోయింది. దీనిపై కూడా తెలంగాణ వైద్య మండలి సీరియస్ అయ్యింది. డెంగ్యూతో ఇబ్బంది పడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా.. అతనికి మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తరలించాలని సిఫార్సు చేయలేదు. దీంతో.. సదరు పేషెంట్ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై బాధితుడి కుటుంబం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా.. విచారణకు ఆదేశించారు.
విచారణలో వైద్యుడి నిర్లక్ష్యాన్ని గుర్తించారు. కలెక్టర్ నుంచి అందిన రిపోర్టు నేపథ్యంలో రాష్ట్ర వైద్య మండలి విచారణ చేసింది. డాక్టర్ శ్రీకాంత్ గుర్తింపును మూడు నెలల పాటు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఈ ఇద్దరు వైద్యులు తమ గుర్తింపు రద్దుపై అప్పీల్ చేసుకోవటానికి మాత్రం అవకాశాన్ని కల్పించారు. ఏమైనా..నిర్లక్ష్యంతో వ్యవహరించే వైద్యుల విషయంలో ఈ తరహా కఠిన చర్యలతో తప్పుడు పనులు చేసే వైద్యుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని మాత్రం చెప్పక తప్పదు.