Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో కొత్త మండ‌లాలు..!

By:  Tupaki Desk   |   25 Aug 2015 9:46 AM GMT
తెలంగాణ‌లో కొత్త మండ‌లాలు..!
X
అప్పుడెప్పుడో పాతికేళ్ల కింద‌ట ఏర్ప‌డిన మండ‌లాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం ల‌భిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త మండ‌లాల్ని ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ స‌ర్కారు సీరియ‌స్‌ గా ఆలోచిస్తోంది.

ఇప్పుడున్న మండ‌లాల‌కు అద‌నంగా మ‌రో 40 నుంచి 50 మ‌ధ్య‌లో మండ‌లాలు ఏర్పాటు చేయాల‌న్న దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తుంద‌ని చెబుతున్నారు. పాల‌నా సౌల‌భ్యంతో పాటు.. ప్ర‌తి మండ‌లంలో యాభైవేల మంది జ‌నాభా ఉండేలా చూసుకుంటూ.. కొత్త మండ‌లాల్ని ఏర్పాటు చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలోని ప‌ది జిల్లాల్లో ప్ర‌తి జిల్లాకు నాలుగైదు చొప్పున మొత్తం 40 నుంచి 50 మ‌ధ్య‌లో మండ‌లాల సంఖ్య పెంచాల‌ని నిర్ణ‌యించింద‌ని చెబుతున్నారు.

కొత్త మండ‌లాలు కానీ ఏర్ప‌డితే ప‌రిపాల‌నా సౌల‌భ్యంతో పాటు.. రాజ‌కీయంగా మ‌రింత ప‌ట్టు పెంచుకునే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అధికార‌ప‌క్షానికి అనుకూలంగా ఈ వ్య‌వ‌హారం సాగే అవ‌కాశం ఉంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి.. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత రాజ‌కీయ అల‌జ‌డి చోటు చేసుకునే వీలుంద‌ని చెబుతున్నారు.