Begin typing your search above and press return to search.

వాగులో టిక్ టాక్.. కొట్టుకుపోయాడు..

By:  Tupaki Desk   |   23 Sept 2019 10:43 AM IST
వాగులో టిక్ టాక్.. కొట్టుకుపోయాడు..
X
టిక్ టాక్ పిచ్చిలో పడి మరో యువకుడి గల్లంతయ్యాడు. వినూత్నంగా వీడియోలు తీసి అందరికీ సర్ ప్రైజ్ ఇద్దామని బయలు దేరిన ముగ్గురు మిత్రులు వాగు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. సరదాగా సాగుతుందనుకున్న వీరి టిక్ టాక్ వీడియో చివరకు విషాదాంతంతో ముగిసింది..

దుబాయ్ లో కాసులు సంపాదిస్తున్న యువకుడు సేద తీరేందుకు సొంతూరుకు వచ్చి గల్లంతయ్యాడు. టిక్ టాక్ మాయలో పడి కొట్టుకుపోయాడు. మరో నెలలో దుబాయ్ పోవాల్సిన సమయంలో టిక్ టాక్ పిచ్చి అతడిని ఎటూకాకుండా చేసింది.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల గోనుగుప్పల గ్రామానికి చెందిన దినేష్ - గంగాజలం - మనోజ్ అనే ముగ్గురు యువకులు తమ ఊరి చివర పారుతున్న కప్పలవాగు వద్దు వెళ్లారు. అక్కడే చేపలు పట్టి టిక్ టాక్ వీడియో చేద్దామని ముగ్గురు వాగులో దిగారు. అయితే పైన ఉన్న చెరువు మత్తడి పడి చెక్ డ్యాంకు వరద పోటెత్తింది. చెక్ డ్యాం కింద వాగు వరదలో టిక్ టాక్ చేస్తున్న ఈ ముగ్గురు యువకులు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. గమనించిన ఒడ్డున ఉన్న కొందరు.. చీరలు అందించి గంగాజలం, మనోజ్ లను కాపాడారు. కానీ దినేష్ మాత్రం వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.

దినేష్ కోసం వాగులో గజ ఈతగాళ్లతో పోలీసులు గాలించినా ఫలితం కనిపించలేదు. కుటుంబ సభ్యులు - అధికారులు వాగు వెంట విస్తృతంగా గాలిస్తున్నారు.