Begin typing your search above and press return to search.

అధికారం మ‌ళ్లీ మాదే.. కేసీఆర్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   20 Jun 2023 11:00 AM GMT
అధికారం మ‌ళ్లీ మాదే.. కేసీఆర్ కామెంట్స్‌
X
తెలంగాణ‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి కూడా తామే అధికారంలోకి వ‌స్తామ‌ని బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కారే అధికారంలోకి వస్తుందని.. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని పునరుద్ఘాటించారు.

దశాబ్ది వేడుకలలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం నిర్వ‌హించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు అందించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టు పనులు 25 శాతం పూర్తయ్యాయన్న సీఎం... మరో మూడు నాలుగు నెలల్లో కాలువల తవ్వకాలు మొదలవుతాయని తెలిపారు.

పాలమూరు రంగారెడ్డి పనులు అడ్డుకున్న కాంగ్రెస్‌ నేతలే.. పనులు చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా ప్రజలకు మంచి జరిగే విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తన హయాంలోనే పూర్తవుతుందని కేసీఆర్ అన్నారు. కృష్టానది జలాలతోనే పంచాయతీ(వివా దం) ఉందని, గోదావరి జలాలతో ఎలాంటి పంచాయతీ లేదని సీఎం అన్నారు. అవసరమైన పక్షంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి గోదావరి జలాలను తీసుకొచ్చి లిప్ట్ ద్వారా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు నీళ్లు అందివ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

పైస‌లు పోయినా ఫ‌ర్వాలేదు!ఈ ఏడాది ఏర్పడినటువంటి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటిపారుదలశాఖ సన్నద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. తాగునీటి అవసరాలకు నీటిని మధ్యమానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలో కూడా ఎత్తిపోయాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ వ్యవసాయాన్ని రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పైసలు పోయినా ఫర్వాలేదు పంటలు కాపాడాలని అధికారులను ఆదేశించారు.