Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ టు.. కాంగ్రెస్‌, బీజేపీ టు టీఆర్ ఎస్.. జంపింగుల పాలిటిక్స్‌

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 AM GMT
టీఆర్ ఎస్ టు.. కాంగ్రెస్‌, బీజేపీ టు టీఆర్ ఎస్.. జంపింగుల పాలిటిక్స్‌
X
తెలంగాణ‌లో జంపింగ్ నేత‌ల పాలిటిక్స్ అదుర్స్ అనే రేంజ్‌లో ఉన్నాయి. అధికార పార్టీ నుంచి ఇటీవ‌ల కొంద‌రు కాంగ్రెస్‌లోకి చేరారు. అది కూడా కీల‌క‌మైన ఖ‌మ్మం.. జీహెచ్ ఎంసీలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇప్పుడు ఇదే జీహెచ్ ఎంసీలో బీజేపీ కార్పొరేట‌ర్లు.. అధికార టీఆర్ ఎస్‌లోకి జంప్ చేయ‌డం గ‌మ‌నా ర్హం. దీంతో తెలంగాణ‌లో జంపింగ్ నేత‌ల పాలిటిక్స్ అదుర్స్ అనేకామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఖ‌మ్మంలో ప‌లువురు నాయ‌కులు టీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేశారు.

ఇది అధికార పార్టీలో క‌ల‌క‌లం రేపింది. ఇక, ఆత‌ర్వాత‌.. టీఆర్ ఎస్ కార్పొరేట‌ర్‌.. పీజేఆర్ కుమార్తె.. ఖైర‌తాబాద్ నాయ‌కురాలు.. విజ‌యారెడ్డి.. టీఆర్ ఎస్‌ను వీడి.. కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. రేవంత్ సార‌థ్యంలో పార్టీని న‌డిపిస్తామ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు..  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైద‌రాబాద్ వేదిక అయిన క్ర‌మంలో.. ఆ పార్టీకి తీవ్ర‌స్థాయిలో ఎదురు దెబ్బ త‌గిలింది. బీజేపీ కి బిగ్ షాక్ తగిలింది.

నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ అధికార పార్టీ టీఆర్ఎస్‎లో చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు  అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్‌, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్‌లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  సమక్షంలో టీఆర్ఎస్‎లో చేరారు.

మోడీకి భారీ షాక్‌..

ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ఇక్క‌డ పాగా వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

అయితే.. ప్రధాని మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న నేప‌థ్యంలో   కార్పొరేటర్లు టీఆర్ఎస్‎  లో చేరడం ఆస‌క్తిగా మారింది. ఒక‌వైపు.. టీఆర్ ఎస్ నుంచి నేత‌లు కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తుంటే.. బీజేపీ నుంచి నేత‌లు.. టీఆర్ ఎస్‌లోకి వెళ్తుండ‌డం జంపింగ్ రాయుళ్ల వ్యూహాలు.. ఏమిటా? అనే సందేహాలకు తెర‌దీసింది.