Begin typing your search above and press return to search.

అమెరికాలో కాల్పులు.. తెలంగాణ జ‌డ్జిగారి అమ్మాయ్ దుర్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   8 May 2023 1:00 PM GMT
అమెరికాలో కాల్పులు.. తెలంగాణ జ‌డ్జిగారి అమ్మాయ్ దుర్మ‌ర‌ణం
X
కాల్పుల‌కు కేరాఫ్‌ గా మారిన అగ్ర‌రాజ్యం అమెరికాలో దారుణాలు ఆగ‌డం లేదు. కార‌ణాలు లేకుండానే ఆగంత‌కులు తుపాకుల‌తో రెచ్చిపోతున్నారు. పైగా.. జ‌న‌స‌మ్మ‌ర్థ ప్రాంతాల‌ను ఎంచుకుని మ‌రీ కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా శ‌నివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మయంలో టెక్సాస్‌ లోని ఒక షాపింగ్ మాల్ ను ల‌క్ష్యంగా చేసుకుని ఓ ఆగంత‌కుడు.. రెచ్చిపోయాడు. క‌న్నుమూసి తెరిచేలోగా తుపాకి నుంచి గుళ్ల వ‌ర్షం కురిపించాడు.

ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 9 మంది మృతి చెందారు. అయితే.. ఆయా మృత‌దేహా ల‌ను గుర్తించిన అధికారులు.. వీటిలో ఒక‌టి భార‌త్‌ కు చెందిన యువ‌తిదిగా ప్రాధ‌మికంగా నిర్ధారించారు. అనంత‌రం.. మ‌రింత లోతుగా ఆ అమ్మాయి పాస్ పోర్టును ప‌రిశీలించిన అధికారులకు ఆ అమ్మాయిని తాటికొండ ఐశ్వ‌ర్యగా గుర్తించారు. ఆమె తెలంగాణ‌ కు చెందిన యువ‌తి అని, ఆమె తండ్రి స్థానిక కోర్టులో జ‌డ్జిగా ప‌నిచేస్తున్నార‌ని తెలుసుకు న్నారు. దీంతో తెలంగాణ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

ఎక్క‌డ‌.. ఎలా?

అమెరికాలో ప్ర‌వాస భార‌తీయులు స‌హా ఫార్న‌ర్లు ఎక్కువ‌గా నివ‌సించే టెక్సాస్‌లో డాలస్ న‌గ‌రానికి ఉత్తరాన 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న అలెన్‌ ప్రీమియర్ షాపింగ్ కాంప్టెక్స్‌లో శనివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. న‌ల్ల‌రంగు కారులో వ‌చ్చిన 33 ఏళ్ల నాజీ సానుభూతి ప‌రుడు మౌరిషియో గార్కియా ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో హైదరాబాద్‌ కు చెందిన తాటికొండ ఐశ్వర్య కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. ఐశ్వర్య మృతితో కొత్తపేటలోని ఆమె నివాసం వద్ద విషాదం నెలకొంది.

దుండ‌గుడు వ‌చ్చీరావ‌డంతోనే కాంప్లెక్స్‌ బయటి నుంచే కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. దుండగుడిని కాల్చి చంపారు. కాల్పుల సమయంలో వందల మంది బయట కు పరుగెత్తిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొంత మంది భయపడి అక్కడే దాక్కున్నారు.

బిల్లు పాస‌య్యేది ఎప్పుడు?

అగ్ర‌రాజ్యంలో తుపాకీ సంస్కృతి నేటిది కాదు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉన్న‌దే. అప్ప‌ట్లో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో తుపాకీల‌కు చాలా తేలిక‌గా లైసెన్స్ ఇచ్చే విధానం అమ‌లు చేస్తున్నారు. అయితే.. ట్రంప్ హ‌యాంలో ఒక పాఠ‌శాల‌లో విద్యార్థి జొర‌బ‌డి.. ఏకంగా 33 మంది విద్యార్థుల‌ను కాల్చి చంపిన త‌ర్వాత‌.. తుపాకీ సంస్కృతి అవ‌స‌ర‌మా? అనేది అమెరికా ను క‌ల‌వ‌రానికి గురి చేసింది. ఈ నేప‌థ్యంలో రూపొందిన తుపాకీ లైసెన్సు క‌ఠిన‌తర బిల్లు.. ఇప్ప‌టికీ పార్ల‌మెంటులో మూలుగుతూనే ఉంది.

మెజారిటీ అమెరిక‌న్లు ఈ బిల్లు ను వ్యతిరేకిస్తున్నారు. అంటే.. వారికి ప‌ప్పుబెల్లాల్లా తుపాకులు కావాలన్న‌మాట‌. ఇంత‌లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉండ‌డంతో ఈ విష‌యంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా.. చ‌ట్ట స‌భ తొక్కి పెట్టింది. మొత్తానికి తుపాకుల సంస్కృతి అయితే.. కొన‌సాగుతుండ‌డం విస్మ‌యానికి గురిచేస్తోంది.