Begin typing your search above and press return to search.
టీజేఎస్ ఓ కలెక్షన్ సెంటర్..వసూలు రాజాలే ఎక్కువ
By: Tupaki Desk | 10 Sep 2018 11:25 AM GMTముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతుంటే...తెలంగాణలో కీలక పక్షంగా ముంద్ర చాటుకోవాలని భావిస్తున్న తెలంగాణ జన సమితి అనూహ్య రీతిలో కుమ్ములాటలతో తెరకెక్కింది. టీజేఎస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తూ మహిళా నేత ప్రొఫెసర్ జ్యోత్స్నఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ టీజేఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. టీజేఎస్ లో డబ్బులు వసూలు చేస్తున్నరని - వసూళ్లకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారని - పార్టీలోని సీనియర్ నేత కపిల్ వాయి దిలీప్ కుమార్ ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు.దిలీప్ కుమార్ పై తాను చేసే ప్రతీ ఆరోపణకు రుజువులు చూపిస్తానని ప్రొ.జ్యోత్స్న అన్నారు.
టీజేఎస్ లో మహిళలకు ప్రాధాన్యత లేదని ప్రొఫెసర్ జ్యోత్స్న ఆవేదన వ్యక్తం చేశారు. టీజేఎస్ కన్వీనర్ సత్యంగౌడ్ తన గురించి అసభ్యకంగా మాట్లాడుతున్నారని, విశాల్ అనే వ్యక్తి తనకు, తన భర్తకు ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఇదేనా ఒక ప్రొఫెసర్ తన పార్టీ నేతలకు నేర్పే నీతి అని ప్రశ్నించారు. దిలీప్ కుమార్ కు తన రూ.2 లక్షలు ఇచ్చానని - అడిగితే పార్టీ ఫండ్ కింద తీసుకున్నామని దబాయిస్తున్నారని తెలిపారు. పార్టీ ఫండ్ కింద ఎన్ని కోట్లు వసూలు చేశాడో దిలీప్ కుమార్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టీజేఎస్ ఒక వ్యాపార సంస్థగా మారిందని స్పష్టం చేస్తూ టీజేఎస్ లో వసూళ్లపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. టీజేఎస్ సిద్ధాంతాలను పక్కన పెట్టిందని - టికెట్లు అమ్ముకునే పార్టీగా టీజేఎస్ తయారైందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష కోసం టీజేఎస్ పనిచేయడం లేదని చెప్పారు. అంబర్ పేట్ టికెట్ ఇవ్వనందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని తనపై అసత్య ప్రచారం చేస్తూ పేపర్లలో రాయించారన్నారు.