Begin typing your search above and press return to search.
రెహమాన్ - గౌతమ్ మీనన్ లు రూపొందించిన బతుకమ్మ పాట.. 'అల్లిపూల వెన్నెల'
By: Tupaki Desk | 5 Oct 2021 12:26 PM GMTతెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో 'బతుకమ్మ' ఒకటి. ప్రతి ఏడాది దసరా మహోత్సవం సందర్భంగా జరుపుకునే ఈ పండగ కోసం తెలంగాణ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయడంతో పాటు తగిన ఏర్పాట్లను చేస్తుంది. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏటా 'బతుకమ్మ' పండుగ కోసం స్పెషల్ సాంగ్స్ సందడి చేస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఫెస్టివల్ కోసం మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి ఒక ప్రత్యేక 'బతుకమ్మ' పాటను రూపొందించారు.
'అల్లి పూల వెన్నెల' అంటూ సాగే ఈ బతుకమ్మ పాటకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ప్రఖ్యాత దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పాటకు దర్శకత్వం వహించారు. బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి నిర్మించిన బతుకమ్మ పాటను కల్వకుంట్ల కవిత మరియు గౌతమ్ వాసుదేవ్ ఈరోజు మంగళవారం సాయంత్రం 5:15 గంటలకు ఆవిష్కరించారు.
బతుకమ్మ పాట ప్రారంభంలో 'అందరూ ఆడి పాడుకునే మట్టి మనుషుల పండుగ కోసం.. మా మనసులోని భావాలకు మా హృదయ స్వరాలను కూర్చి ఒక పాటగా పేర్చి మేము అందిస్తున్న చిన్న కానుక' అని రెహమాన్ & గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. తెలంగాణలోని జిల్లాల్లో పలు ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ పాట బతుకమ్మ పాట విశిష్టతను తెలియజేసేలా సాగింది. ఈ పండుగను ప్రజలు ఎంత సంబరంగా జరుపుకుంటారు అనేది 'అల్లి పూల వెన్నెల' పాటలో చూపించే ప్రయత్నం చేశారు.
బతుకమ్మ పాటను ఉత్తరా ఉన్నికృష్ణన్ తో పాటుగా పలువురు సింగర్స్ ఆలపించారు. మిట్టపల్లి సురేందర్ ఈ గీతానికి సాహిత్యం అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బృందా మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. బతుకమ్మ పండుగను తెలంగాణలో అంతర్భాగంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజల సాంస్కృతిక గుర్తింపును గుర్తిస్తుంది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సాంస్కృతిక ఏకీకరణకు మరియు తెలంగాణ ఉద్యమ మూలాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుండి భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తెలంగాణ సాంస్కృతిక మరియు సాహిత్య ప్రకృతి దృశ్యాలకు తెలంగాణ జాగృతి ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఇప్పుడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ - సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ వంటి వారు తెలంగాణ జాగృతి తో కలిసి బతుకమ్మ పాట ద్వారా తెలంగాణ పండుగ వాతావరణాన్ని చూపించారు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు సంతోషకరమైన రంగురంగుల బతుకమ్మ పండుగను ఆస్వాదించడానికి సహకారం అందిస్తోంది. ఏఆర్ రహ్మాన్ ఈ పాట గురించి ట్వీట్ చేస్తూ.. ''బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! ఇది జీవితపు పండుగ. ఐక్యత యొక్క వేడుక. తెలంగాణ జాగృతితో "అల్లిపూల వెన్నెల" ద్వారా బతుకమ్మ అందం యొక్క ఒక సంగ్రహావలోకనం మీకు అందిస్తోంది'' అని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ.. ''రంగులు మరియు మెలోడీల కలయికల పండుగ బతుకమ్మ ఇక్కడ ఉంది! బతుకమ్మ కోసం ఏఆర్ రెహమాన్ - గౌతమ్ మీనన్ మరియు నా సోదరీమణులందరి కోసం ఒక కలల బృందం అందించినదే ఈ ప్రత్యేక పాట'' అని తెలిపారు. కాగా, 9 రోజుల పాటు జరిగే 'బతుకమ్మ' పండుగ అక్టోబర్ 6 నుండి తెలంగాణ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కానుంది.