Begin typing your search above and press return to search.

బాబు మూడేళ్లలో చేసిన పని.. మూడు ముక్కలు చెప్పి అంతకు మించి చేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   30 April 2022 7:31 AM GMT
బాబు మూడేళ్లలో చేసిన పని.. మూడు ముక్కలు చెప్పి అంతకు మించి చేసిన కేటీఆర్
X
అధికారం చేజారి.. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికార దండాన్ని చేతికి తీసుకున్న వెంటనే విమర్శల వర్షం కురిపించటం ఏ మాత్రం సరైన వ్యూహం కాదు. ప్రజల్లో కొత్త ప్రభుత్వం మీద ఉన్న ఆశల కరిగి.. భ్రమలు తొలిగిపోయే వేళ.. సరైన సమయం చూసుకొని ఎంట్రీ ఇవ్వాల్సిన విపక్ష నేత.. అందుకు భిన్నంగా అవసరం ఉన్నా లేకున్నా బయటకు వచ్చి వాపోవటం ద్వారా కలిగే లాభం పెద్దగా ఉండదు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏదోలా డ్యామేజ్ చేసేందుకు విపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

మూడేళ్లుగా అలుపెరగని రీతిలో జగన్ మీద పోరాడుతూ.. ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపేందుకు కిందా మీదా పడుతున్న చంద్రబాబు ఎంతటి డ్యామేజ్ చేయగలిగారో.. శుక్రవారం హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీలో నిర్వహించిన క్రెడాయ్ సదస్సులో కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మూడు ముక్కలు.. ఏపీ లోని జగన్ సర్కారుకు దిమ్మ తిరిగేలా చేయటమే కాదు.. అధికారపక్ష నేతలంతా అప్పటికప్పుడు హడావుడిగా రియాక్టు కావటం ద్వారా మంత్రి కేటీఆర్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు.

ఏపీ అధికారపక్షంపై కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మూడు ముక్కలు.. ఒక పిట్టకథ చేసిన రచ్చ మామూలుగా లేదన్న మాట వినిపిస్తోంది. విపక్ష నేత చంద్రబాబు మూడేళ్ల పాటు చేసిన పనిని .. మంత్రి కేటీఆర్ మూడు ముక్కల్లో చెప్పేయటమే కాదు.. ఏపీ ప్రభుత్వానికి భారీ డ్యామేజ్ చేయగలిగారు.

ఇదంతా చూసినప్పుడు చెప్పే మాట సూటిగా ఉండటంతో పాటు.. ప్రభుత్వాన్ని ఇరుకున పడే స్వభావం ఉండాలి. అప్పుడే వర్కువుట్ అవుతుంది.

అందుకు మంత్రి కేటీఆర్ మాటే నిదర్శనంగా చెబుతున్నారు. అయితే.. కేటీఆర్ తన మాటలకు భిన్నమైన ట్వీట్ ను శుక్రవారం అర్థరాత్రివేళలో పోస్టు చేయటం చూసినప్పుడు.. తాజా వివాదానికి పుల్ స్టాప్ పెట్టారన్న మాట వినిపిస్తోంది.

ఏమైనా.. నోటికి వచ్చినట్లు మాట్లాడినా.. ఏపీ స్టేట్ లోని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసే సత్తా తనకెంత ఉందన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ తాజా ఎపిసోడ్ తో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.