తెలంగాణ రాష్ట్రం రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీష్ రావు సమీక్షించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4శఆతం అని చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతం ఉందన్నారు.
దేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే పడిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. బంగ్లాదేశ్ లో తలసరి ఆదాయం భారత్ కంటే 10 డాలర్లు ఎక్కువగా ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్ లో తలసరి ఆదాయం 1885 డాలర్లు, భారత్ లో తలసరి ఆదాయం 1875 డాలర్లు అని వివరించారు. ఆరేళ్లలో తెలంగాణ వృద్ధి రేటు నంబర్ 1గా ఉందన్నారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది మూడో స్థానమన్నారు.
దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం అని వివరించారు. తలసరి ఆదాయంలో ఏడేళ్ల క్రితం తెలంగాణ 10వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. తలసారి ఆదాయంలో గత ఏడేళ్లలో 7 రాష్ట్రాలను తెలంగాణ అధిగమించిందన్నారు.
2014-15 తర్వాత తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే 11.5 శాతంతో అత్యధిక సగటు వృద్ధిని తెలంగాణ నమోదు చేసిందన్నారు. 2014-15 తో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పుడు 91.5శాతం పెరిగిందని చెప్పారు. 2014-185తో పోలిస్తే దేశ తలసరి ఆదాయం ఇప్పడు 458.7శాతం మాత్రమే పెరిగిందన్నాడు. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువని వెల్లడించారు. కేసీఆర్ విధానాల వల్లే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఐటీ, ఇండస్ట్రీ వ్యవసయా రంగాల వల్లే తెలంగాణ సంపద పెరిగిందన్నారు.