Begin typing your search above and press return to search.

ఆ వ్యక్తి ఆరు రోజులను ఆరా తీస్తున్న తెలంగాణ

By:  Tupaki Desk   |   13 March 2020 7:54 AM GMT
ఆ వ్యక్తి ఆరు రోజులను ఆరా తీస్తున్న తెలంగాణ
X
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలి తీసుకుంటున్న కరోనా భారత్‌లో తన పంజా చూపెట్టింది. కరోనా వైరస్ ఒకరిని పొట్టన పెట్టుకోవడంతో కర్నాటకతో పాటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో తొలి కరోనా మృతి కేసు కర్నాటకలో నమోదైన విషయం తెలిసిందే. అయితే కర్నాటక లో మృతి జరిగితే ఆ వ్యక్తి తెలంగాణలో పర్యటించడంతో తెలంగాణలో కూడా కలకలం రేపింది. వైరస్ వ్యాపించిన వ్యక్తి దాదాపు ఆరు రోజుల పాటు తెలంగాణలో తిరిగాడని కర్నాటక ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఆరు రోజులు తిరిగిన వివరాలను తెలంగాణ సేకరిస్తోంది.

కర్నాటక రాష్ట్రంలోని కల్‌ బుర్గికి చెందిన సిద్దిఖి (76) ఈనెల పదో తేదీన మరణించాడు. అయితే ఆయన అంతకుముందు తెలంగాణలో పర్యటించాడు. దాదాపు ఆరు రోజుల పాటు గడిపాడు. కలబుర్గికి చెందిన మహ్మద్‌ సిద్ధిఖి జనవరి 29వ తేదీన సౌదీ ఆరేబియాకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని ఫిబ్రవరి 29వ తేదీన సౌదీ నుంచి నేరుగా హైదరాబాద్‌ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడంట. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి మార్చి 5వ వరకు హైదరాబాద్ లో గడిపాడంట. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆ ఆరు రోజులు సిద్ధిఖీ ఎక్కడెక్క తిరిగాడు? ఎవరెవర్ని కలిశాడో ఆరా తీస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయాన్ని గుర్తించి ఆ ఆస్పత్రిని కూడా తెలంగాణ అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు.

ఫిబ్రవరి 29 నుంచి మార్చి 6వ వరకు ఏయే ప్రాంతాలు తిరిగాడు.. పాతబస్తీలో ఎక్కడ? ఏం చేశాడు? వేటిలో ప్రయాణించాడు అనేవి వాకబు చేస్తున్నారు. ఎందుకంటే వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో తిరిగితే వారికి వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సిద్దిఖీ బంధువులు ఎవరు? ఎక్కడెక్కడ తిరిగాడు వంటి వివరాలు సేకరిస్తున్నారు. వారి కుటుంబసభ్యుల్లో ఎవరైనా జ్వరం - జలుగు - దగ్గుతో బాధపడుతుంటే వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. సిద్దిఖి హైదరాబాద్‌లో ఆరు రోజులు ఉన్నట్టు కర్నాటక పక్కా సమాచారం ఇవ్వడంతోపాటు సిద్ధిఖీకి సంబంధించిన బంధువుల వివరాలను ఆ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అడిగి తెలుసుకుంటోంది. కర్నాటక సహాయం కూడా తీసుకుని హైదరాబాద్ కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టింది.

సిద్ధిఖి హైదరాబాద్‌ లో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరినీ కలిశాడు అనే దానిపై వివరాలు సేకరిస్తోంది. సిద్దిఖీ బంధువుల ఆచూకీ తెలుసుకుంటోంది. పాతబస్తీలోని సిద్ధిఖి హైదరాబాద్ లో కలిసిన అతడి బంధువులు, ఆ చుట్టుపక్కల ఉన్న వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారందరికి గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. వారి శాంపిల్స్ పుణెకు పంపించి రిపోర్ట్‌ లు వచ్చే వరకు ఐసోలేషన్‌ వార్డులో ఉంచే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి కొన్నాళ్లు అదుపులో ఉండగా ఇప్పుడు పంజా విసురుతోంది. అయినా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి వైరస్ లు సోకవని ఈ సందర్భంగా "తుపాకీ" మీడియా సూచిస్తోంది.