Begin typing your search above and press return to search.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే ... !

By:  Tupaki Desk   |   16 Jan 2021 12:30 PM GMT
తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే ...  !
X
ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ నెలలో మొదలుకానున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ మండలి.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే తేదీపై కసరత్తు నిర్వహించింది. వీటితో పాటు పది, ఇతర పరీక్షలను కూడా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని సమాచారం. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సమాచారం. ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు ప్రారంభమై మే మధ్య వరకు జరుగుతాయని వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన డేట్స్ త్వరలో ప్రకటించనుంది.

ఈ పరీక్షల్లో 70 శాతం కరిక్యులమ్ ద్వారా ఉంటుంది. మిగిలినది ప్రాజెక్టు, అసైన్ ‌మెంట్ల ద్వారా ఉంటుంది. అయితే, విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి. గతంలో ఇచ్చినట్టు ఐదు ప్రశ్నల్లో మూడు ప్రశ్నలకు సమాదానాలు రాయండి తరహాలో కాకుండా ఏడు ప్రశ్నలు ఇచ్చి వాటిలో మూడింటికి ఆన్సర్లు రాయండి అనేలా ఉంటుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. తెలంగాణలో జూనియర్ కాలేజీలు ఫిబ్రవరి 1నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ముందు నిర్వహిస్తారు. ఆ తర్వాత ధియరీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిపై స్పష్టమైన షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా ఇప్పటి వరకు విద్యార్థులకు దూరదర్శన్ , టీశాట్ ద్వారా క్లాసులను చెబుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలు ప్రారంభం అవుతాయి. 300 మంది కంటే తక్కువ ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 4 వరకు క్లాసులు అటెండ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. 300 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే రెండు షిఫ్టుల్లో క్లాసులు జరుగుతాయి. అలాగే, ఎగ్జామ్ ఫీజు ఎంత అనేది తెలంగాణ ఇంటర్ బోర్డు త్వరలో ప్రకటించనుంది. ఇంతకుముందు విద్యా క్యాలెండర్ ప్రకారం.. మార్చి 24న ఇంటర్ పరీక్షలు మొదలయ్యేవి. కానీ కరోనా ఆలస్యంగా ప్రారంభం కానుంది.