Begin typing your search above and press return to search.
వివేకా కేసులో తెలంగాణ హైకోర్టు షాకింగ్ నిర్ణయం.. !
By: Tupaki Desk | 28 Feb 2023 9:45 AM GMTఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడుగా సీబీఐ పేర్కొన్న సునీల్ యాదవ్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సునీల్ యాదవ్తో పాటు సీబీఐ, వివేకా భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత సుదీర్ఘ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ దశలో బెయిల్ ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది.
సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు..
వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టుకు తెలిపింది. హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్ యాదవ్ అనుమానిత రాజకీయ నేతలతో కలిసి ఉన్నట్లు 'గూగుల్ టేక్ అవుట్' ద్వారా గుర్తించినట్లు సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేంద్రన్ హైకోర్టుకు వివరించారు. సునీల్ యాదవ్కు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని.. సాక్షులను బెదిరిస్తారన్నారు. సునీల్ యాదవ్ ఇతర నిందితులతో కలిసి చేసిన కుట్రను దస్తగిరి, రంగయ్య స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు.
వివేకా సతీమణి, కుమార్తె తరఫు వాదనలు..
వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదించారు. సునీల్ యాదవ్ రెండు రాజకీయ గ్రూపుల మధ్య చిక్కుకున్న సాధారణ వ్యక్తి కాదని.. హత్యలో పాత్రధారిగా, సూత్రధారిగా వ్యవహరించారని వాదించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు సాక్షులు ప్రభావితమయ్యారని.. కుట్రలో భాగమైన ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నందున.. సునీల్కు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.
సునీల్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే..
వివేకా హత్య కేసుతో సునీల్కు సంబంధం లేదని.. ఓ మహిళ హనీ ట్రాప్‌తో జరిగిందని అతని తరఫు న్యాయవాది నయన్కుమార్ వాదించారు. తన మామకు వివాహేతర సంబంధాలున్నాయని.. ఓ మహిళకు 8 కోట్ల రూపాయలు ఇచ్చారని వివేకా అల్లుడే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు గుర్తు చేశారు.
రెండు రాజకీయ గ్రూపుల మధ్య పోరులో సునీల్ యాదవ్ చిక్కుకున్నారన్నారు. ఛార్జ్‌షీట్ వేసిన తర్వాత కూడా ఇంకా జైళ్లో పెట్టాల్సిన అవసరం లేదని.. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వాదించారు.
హైకోర్టు తీర్పు ఇదే..
అన్ని పక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్. సుమలత తీర్పు వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుత దశలో సునీల్‌కు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. నిందితుల వ్యక్తి గత స్వేచ్ఛ ముఖ్యమే అయినప్పటికీ.. నిష్పక్షపాత దర్యాప్తు, సాక్షుల భద్రత అంతకంటే ప్రధానమని తేల్చి చెప్పారు. సాక్షిగా విచారణ జరిపి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత.. తదుపరి ఆధారాలతో అదే వ్యక్తిని నిందితుడిగా మార్చవచ్చునని పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.