Begin typing your search above and press return to search.
తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం.. ఒక్కరికే 22 కాంట్రాక్టులా?
By: Tupaki Desk | 7 Jun 2023 10:39 AM GMTకేసీఆర్ సర్కారు నిర్ణయాలకు సంబంధించిన వ్యాజ్యాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఉదంతం చోటు చేసుకుంది. భదాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయితీ రాజ్.. ఆర్ అండ్ బీ శాఖలకు సంబంధించి ఒకే కాంట్రాక్టర్ కు 22 కాంట్రాక్టులు అప్పగించిన వైనంపై తెలంగాణ హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఒకే సంస్థకు రెండు శాఖలకు సంబంధించిన కాంటాక్టులు ఎలా అప్పగించాయన్న విషయాన్ని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని కౌంటర్ల రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది.
అంతేకాదు.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బిల్లులు చెల్లించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకరికే 22 కాంటాక్టులు అప్పగించిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోరంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తి తన వ్యక్తిగత హోదాలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు.
దీని పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. జస్టిస్ ఎన్. తుకారంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులు లేకుండా రోడ్లు.. వంతెనల నిర్మాణాన్ని ఎంఎస్ఆర్ కన్ స్ట్రక్షన్స్ చేపట్టిందని.. కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి అనుమతులు లేవన్న విషయాన్ని ప్రస్తావించారు.
ఒకే కాంట్రాక్టర్ కు 22 కాంట్రాక్టులు ఇవ్వటం.. వేర్వేరు శాఖలకు సంబంధించిన పనుల్ని ఒక్కరికే ఎలా అప్పజెబుతారు? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ప్రభుత్వన్యాయవాది తన వాదనను వినిపించారు.
కాంట్రాక్టుల అప్పగింతకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నట్లు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కాంట్రాక్టర్ సహా అధికారులకు నోటీసులు జారీ చేస్తూ.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని కోరింది అదే సమయంలో.. సదరుకాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపులు తాము చెప్పే వరకు ఇవ్వొద్దన్న ఆదేశాల్ని ఇచ్చారు. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.