Begin typing your search above and press return to search.
కరోనాపై తప్పుడు లెక్కలు , టీ సర్కార్ పై మళ్లీ హైకోర్టు ఫైర్ !
By: Tupaki Desk | 4 Sep 2020 5:00 PM GMTతెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేసులు, మరణాలు చాలా తక్కువగా రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. . రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం నిర్లిప్తత, అలాగే, ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వ చర్యలు వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మార్చి 31 నుంచి ఇప్పటి వరకు కేవలం రోజుకు 8 లేదా 9, 10 మంది మాత్రమే కరోనా వల్ల చనిపోయారని ప్రభుత్వం రిపోర్టులు ఇవ్వడం మీద కోర్టు అనుమానం వ్యక్తం చేసింది.
కరోనా కేసులు, మరణాలను తక్కువగా చూపుతున్నారని అభిప్రాయపడింది. దీంతో వెంటనే సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు ఎన్ని ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు.. చర్యలపై నివేదిక సమర్పించాలని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని కోర్టు ప్రశ్నించింది. 50శాతం బెడ్స్ పై ఢిల్లీ మాదిరిగా వ్యవహరించాలి. తెలంగాణలో ఎలా చేశారో నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజాస్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి.. దానితో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కోర్టు ఆదేశించింది. కరోనా పై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, ప్రజారోగ్య రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో చెప్పాలని పిటిషనర్ కోరగా, దీనిపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని కోరింది. ఈనెల 22లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ తప్పుడు నివేదికలు సమర్పిస్తే చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,478 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య సంఖ్య తక్కువగానే ఉంది. కొత్తగా 10 మరణాలు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు సంఖ్య 866కి చేరింది