Begin typing your search above and press return to search.
జగన్ అక్రమాస్తుల కేసుపై.. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 8 March 2022 4:54 PM GMTఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు RRR వేసిన పిల్ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌కు నెంబర్ కేటాయించాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి రాఘురామ 10 నెలల క్రితమే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌కు నెంబర్ ఇవ్వకపోవడంతో ఇంతవరకు విచారణకు రాలేదు. మరోసారి పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ రఘురామ వేసిన పిల్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజాప్రతినిధుల కేసులు త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామ హైకోర్టుకు వెళ్లారు. అయితే.. దీనిపై పలు అభ్యంతరాలతో తెలంగాణ హైకోర్టు కార్యాలయం అనుమతించలేదు. రిజిస్ట్రీ అభ్యంతరాలను తాజాగా హైకోర్టు తోసిపుచ్చింది.
రఘురామ తరఫు న్యాయవాది అభ్యర్థనతో.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ఇటీవల నంబరు కేటాయింపు అంశంపై విచారణ జరిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రతివాదుల జాబితాలో ఎందుకు చేర్చలేదని ధర్మాసనం ప్రశ్నించంది. వాదనలను వినకుండా ఉత్తర్వులెలా జారీ చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ప్రశ్నించింది. స్పందించిన న్యాయవాది.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం లేదని వివరించారు. అయితే..
దీంతో, ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందని హైకోర్టు నిర్ధారిస్తే జగన్‌కు మరిన్ని చిక్కులు తప్పవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ, ఈడీలు సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే జగన్ ఇబ్బందుల్లో పడతారని అంటున్నారు. కాగా, జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 అభియోగపత్రాలను దాఖలు చేసిన సీబీఐ అసమగ్రంగా విచారణ చేసిందని రఘురామ ఆరోపించారు.
ఇదీ.. పిటిషన్
విదేశాల నుంచి, బోగస్ కంపెనీల నుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఈడీ, ఐటీ శాఖలకు లేఖ రాసి చేతులు దులుపుకుందని తన పిటిషన్‌లో రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
2004లో రూ.11 లక్షల ఆదాయమున్న జగన్ 2009లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయేనాటికి రూ.43 వేల కోట్లు ఆర్జించారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. హౌరా, కోల్‌కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు ‘జగతి’లోకి వచ్చాయని, వాటిపై ఐటీ, ఈడీలకు లేఖ రాసి సీబీఐ సరిపెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు వీటిపైనే తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.