Begin typing your search above and press return to search.
కుల సంఘాలకు భూములా? కేసీఆర్ సర్కారుకు హైకోర్టు తలంటు
By: Tupaki Desk | 16 Jun 2023 11:12 AM GMTకులాల వారీగా ఒక్కో కుల సంఘానికి ఎకరం.. రెండు.. ఐదు ఎకరాల చొప్పున కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఆ నిర్ణయాల్లోని సహేతుకతను వేలెత్తి చూపించింది. ఇప్పుడున్న కాలంలో కులాల వారీగా సంఘాలకు భూములు ఏర్పాటు చేసి.. సొంత భవనాల్ని ఏర్పాటు చేయంచే వైనంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. కుల రహిత సమాజానికి ప్రయత్నించాల్సిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా కులాల్ని ప్రోత్సహించేలా భూములు కేటాయించటం అసంబద్ధమని పేర్కొంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో కమ్మ.. వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున భూమిని కేటాయించటాన్ని సవాలు చేస్తూ.. రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. జస్టిస్ ఎన్. తుకారంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఆసక్తికర వాదనలు వినిపించారు.
హైటెక్ సమీపంలో కోట్లాది రూపాయిలు విలువ చేసే భూముల్ని ప్రభుత్వం కుల సంఘాలకు కేటాయించింది. రాష్ట్రంలో కమ్మ.. వెలమ రెండు వర్గాలు అత్యంత ధనిక వర్గాలేనని కోర్టుకు చెప్పారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎకరం రూ.50 కోట్లు ఉన్నప్పటికీ.. మార్కెట్ ధర ప్రకారం దానికి చాలా రెట్లు ఎక్కువగా ధర ఉంటుందన్నారు.
దీనికి బదులుగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ కేవలం కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం ఈ రెండు కులాలకే కాదు.. ఇతర కులాలకు భూమి కేటాయించామన్నారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ఈ కేసు విచారణను ఆగస్టు 28కు వాయిదా వేశారు.
విచారణ సందర్భంగా చేసిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే..
- 21వ శతాబ్దంలోనూ కులాల వారీగా ప్రోత్సాహకాలా? కుల విభజనకు దారి తీసేలా ప్రభుత్వ విధానం ఉంది. మనం ఎక్కడికి వెళుతున్నాం?
- అణగారిన కులాల్ని ఆదుకోవటంలో అర్థం ఉంది. ఇలా సంఘాల వారీగా కేటాయింపులు ఏమిటి? హైటెక్ రాష్ట్రంలో ఇదేం విధానం?
- కుల రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ఇలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా?
- కొన్ని రాష్ట్రాల్లో కుల సంఘాలే భూములను స్వయంగా మార్కెట్ ధరకు కొనుగోలు చేసి ఆసుపత్రులు నిర్మించాయి. కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ.. విద్యా సంస్థలు.. హాస్టల్స్ నిర్మిస్తుంటాయి.