Begin typing your search above and press return to search.
సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు!
By: Tupaki Desk | 13 Dec 2021 2:31 PM GMTవైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు, ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మధ్య వైరం ఇప్పట్లో తగ్గేలా లేదు. రెండేళ్ళకు పైగా వీరిద్దరి మధ్య ఫైట్ కొనసాగుతోంది.జగన్ ను జైలుకు పంపాలని ఎంపీ రఘురామ పిటీషన్ల మీద పిటీషన్లు వేశారు. వీరి బంధంలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు.
సిఎం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఉదయం పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి 11 చార్జిషీట్లు దాఖలైనందున సిఎంకు బెయిల్ మంజూరు చేయరాదని రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తనపై దాఖలైన కేసులకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది కాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులన్నింటినీ త్వరగా విచారించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో 11 ఛార్జిషీట్‌లపై విచారణను వేగవంతం చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.
జగన్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రఘురామ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
కోర్టులో రోజువారీగా కేసుల విచారణ జరగాలంటే దానిపై నిర్ణయం తీసుకునే నోటీసులకు జగన్ తరపు న్యాయవాదులు ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.