Begin typing your search above and press return to search.

తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం

By:  Tupaki Desk   |   8 Nov 2020 5:30 PM GMT
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం
X
తెలంగాణ హైకోర్టు మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా లాక్ డౌన్ తో మూతపడ్డ కోర్టులు ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, వర్చ్యువల్ పద్ధతిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

అన్ లాక్ మొదలు కావడంతో అన్నింటికి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

తాజాగా తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 31 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్ లాక్ విధానాన్ని వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో భౌతికంగా కేసుల విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్ కోర్టులూ తెరవాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టులో డిసెంబర్ 31 వరకు ప్రస్తుత ఆన్లైన్, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ఇప్పుడు అనుసరిస్తున్న విధానామే కొనసాగించాలని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించారు.