Begin typing your search above and press return to search.
ధరణి రిజిస్ట్రేషన్ పై హైకోర్టు సూటి ప్రశ్నలు
By: Tupaki Desk | 26 Nov 2020 4:30 AM GMTతెలంగాణలో జరుగుతున్న మరో అతిపెద్ద కార్యక్రమంపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదుకు ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని తెంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఇప్పటికే సూచించింది. ధరణిలో ఆస్తుల నమోదుపై దాఖలైన వివిధ పిటిషన్లపై తాజాగా న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ధరణి పేరిట ఆస్తుల నమోదు విషయంలో వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారనే దానిపై పిటీషన్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డేటా దుర్వినియోగం అయితే భద్రతకు విఘాతం కలుగుతుందని హైకోర్టుకు విన్నవించారు. దీనిపై ప్రభుత్వ అడ్వకేట్ సమాధానమిస్తూ డేటా భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కాగా ధరణిలో ఆస్తుల నమోదు చేయకుంటే రిజిస్ట్రేషన్ చేయమనే ప్రభుత్వ ప్రకటన రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ కు వ్యతిరేకమని హైకోర్టు తెలిపింది.
ధరణిలో ఆస్తులు నమోదు చేసుకోని యజమాని చనిపోతే ఆ ఆస్తి వారసులకు చెందదా అని ప్రశ్నించింది. ధరణి పోర్టల్ లో డేటా హ్యాక్ కాదని గ్యారంటీ ఏమిటీని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
డేటా పరిశీలన అధికారం తహసీల్దార్ , ఇతర అధికారులకు ఇస్తే దుర్వినియోగం అవుతుందని అభిప్రాయపడింది.