Begin typing your search above and press return to search.

వైర‌స్‌ పై అది ఫేక్ స‌ర్వే: ఖ‌ండించిన తెలంగాణ‌

By:  Tupaki Desk   |   23 Jun 2020 5:00 PM GMT
వైర‌స్‌ పై అది ఫేక్ స‌ర్వే: ఖ‌ండించిన తెలంగాణ‌
X
వైరస్ వ్యాప్తి దేశంలో తీవ్రంగా ఉంది.. అయితే కేవ‌లం కొన్ని రాష్ట్రాల్లోనే ఆ వైర‌స్ కరాళ నృత్యం చేస్తోంది. దీనికి సంబంధించి తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో కొన్ని సంస్థ‌లు, కొంద‌రు వైర‌స్ వ్యాప్తి.. దాని ప‌రిణామ క్ర‌మాన్ని అధ్య‌య‌నం చేస్తున్నారు. వైర‌స్ వ్యాప్తి ఏ రాష్ట్రంలో ఎంత ఉంది? ఏ ద‌శ‌లో ఉంది? అని త‌దిత‌ర వివ‌రాల‌తో ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక స‌ర్వే వెలుగులోకి వ‌చ్చింది. ఆ స‌ర్వేను చూసిన వారంతా ఆందోళ‌న చెందారు. ముఖ్యంగా తెలంగాణ వాసులు.

వాస్త‌వంగా ప‌రీక్ష‌లు పెంచ‌డంతో తెలంగాణ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు.. రాష్ట్రంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి 122 శాతం అని ఒక మ్యాప్ రూపొందించి సోషల్ మీడియాలో వ‌దిలారు. ఆ మ్యాప్ ఇప్పుడు తెలంగాణ‌లో ప్ర‌కంప‌న‌లు లేపుతోంది. ఈ స‌ర్వేపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పందించింది. అదీ ఫేక్ అని స్పష్టం చేసింది. భారతదేశం మ్యాపులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఇండియా.ఇన్.పిక్సెల్స్ ఓ మ్యాప్ రూపొందించింది. ఈ మ్యాప్‌లో ఏ రాష్ట్రంలో ఎంత స‌మూహ వ్యాప్తి ఉంద‌ని వివ‌రాలతో చెప్పింది. దీని ప్ర‌కారం.. దేశంలో అత్య‌ధికంగా కేసులు ఉన్న మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ 65 శాతం ఉండగా, ఒక్క తెలంగాణలో మాత్రం 122 శాతం ఉంది అని పేర్కొంది.

దీంతో ఆందరూ ఆందోళ‌న చెందుతున్నారు. దీనిని వైద్యారోగ్యశాఖ ఖండించింది. గ్రాఫిక్స్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదని.. దీని వెనక వైద్యుడు/నిపుణులు లేరు అని.. ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన గ్రాఫిక్స్‌కు శాస్త్రీయ ఆధారం ఏది లేద‌ని.. దాన్ని న‌మ్మొద్ద‌ని సూచించింది. తప్పుడు సమాచారం ఇచ్చార‌ని పేర్కొంది. ఈ డేటాను ఆరోగ్య సేత యాప్ ద్వారా తీసుకున్నట్టు తెలుస్తోందని.. అయితే రాష్ట్రంలో అందరూ ఆ యాప్ ఉపయోగించడం లేదు కదా అని ప్ర‌శ్నించింది. ఓ వ్యక్తి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని ఎలా అంచనా వేశారని సందేహం వ్య‌క్తం చేస్తోంది. దీంతో ఆ స‌ర్వేను ఎవ‌రూ న‌మ్మొద్దు.. అది ఫేక్ అని స్ప‌ష్టం చేసింది.