Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్.. కానీ కండీషన్లు అప్లై!

By:  Tupaki Desk   |   9 Nov 2022 12:30 PM GMT
ఎట్టకేలకు ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్.. కానీ కండీషన్లు అప్లై!
X
వివాదాస్పద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టకేలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ పలు షరతులు విధించింది. ఇక నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కండీషన్ విధించింది. ఆయన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే రాజాసింగ్ జైలు పాలయ్యారు. పీడీ యాక్ట్ కు దారితీసింది.

హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ జైలు నుంచి విడుదలయ్యే సమయంలో నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా రాజాసింగ్ ప్రెస్ మీట్, సభలు, ర్యాలీల్లో సమావేశాల్లో పాల్గొనకూడదని తెలిపింది. ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని రాజాసింగ్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం పాడీ యాక్ట్ పై రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆయన ఒక మతప్రవక్తపై దారుణ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ ఓ మత ప్రవక్తపై చేసిన కామెంట్స్ తెలంగాణలో చిచ్చు పెట్టాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ నేతల మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతున్నాయి.

రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో హైదరాబాద్ అల్లకల్లోలం అయ్యింది. దాంతో ప్రశాంతంగా భాగ్యనగరంలో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడ్డాయి. ఇక రాజాసింగ్ పై కోపంతో ఓ వర్గం వారు మరింతగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టి జనాన్ని తీసుకొచ్చి కమిషనర్ కార్యాలయం ముందు.. రాజాసింగ్ ఇంటిని ముట్టడించారు.

ఈక్రమంలోనే మతపరమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. పీడీ యాక్ట్ పెట్టి రాజాసింగ్ ను జైలుకు పంపారు. సంవత్సరం పాటు బెయిల్ రాకుండా చేశారు. కానీ పలు నిబంధనలతో హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.

ఇటు బీజేపీ బహిష్కరించడంతో ఆయనకు పార్టీ బలం లేకపోవడంతో తెలంగాణ సర్కార్ కొరఢా ఝలిపించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.