Begin typing your search above and press return to search.

సాగునీటి రంగం బలోపేతానికి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   20 July 2020 6:05 AM GMT
సాగునీటి రంగం బలోపేతానికి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాజెక్ట్స్ పూర్తికావడంతో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. దీనితో సీఎం కేసీఆర్, ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రస్త తం నీటిపారుదల శాఖ ఎన్నో భాగాలుగా ఉంది. భారీ, మధ్య, చిన్న తరహా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీలుగా విభజించి ఉంది. మొత్తం ఒకే విభాగంగా చేయాలనీ ,ఆ చేస్తే ఆ విభాగం పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం భావించారు. అందుకే నీటి పారుదల శాఖను 15–20 ప్రాదేశిక విభాగాలుగా చేసి , ఒక్కో దానికి ఒక్కో చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ )ని ఇన్‌ చార్జిగా నియమించాలని. ఆ సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ ‌డ్యామ్‌ లు ఉండేలా చేయనున్నారు.

దీనికి సంబంధించి ముసాయిదా తయారు చేయాలని ఇప్పటికే జరిగిన సమీక్షలో సీఎం అధికారులకి ఆదేశాలు జారీచేశారు. నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌ 2రోజుల పాటు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్‌ షాపు నిర్వహించి, ముసాయిదా రూపొందించారు. దీనిని సోమ వారం సీఎం కేసీఆర్ ‌కు సమర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఈఎన్సీలు, సీఈలు పాల్గొంటారు.

అలాగే మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం నాటి సమీక్షలో డిజైన్ల పై పూర్తి స్థాయిలో చర్చిస్తారు. సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి.. లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి.. అనే విషయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఈ సమీక్షలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు.