Begin typing your search above and press return to search.
కూల్చివేతకు రంగం సిద్ధం.. టార్గెట్ ఫిక్స్.. 2 రోజుల్లో అన్ని పనులు జరిగాయా?
By: Tupaki Desk | 2 July 2020 5:00 AM GMTఅధికారం చేతిలో ఉండాలే కానీ కొండ మీద కోతినైనా తీసుకురావొచ్చన్న నానుడి వాస్తవంలో ఎంత నిజమన్న విషయం తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న ఒక విషయంలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. సీఎ కేసీఆర్ డ్రీం ప్రాజెక్టు అయిన కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు వీలుగా ఇటీవల హైకోర్టు తీర్పు ఇవ్వటం తెలిసిందే. పాత సచివాలయాన్ని కూల్చి వేయటానికి అనుమతి ఇచ్చింది. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయో లేదో.. అందుకు సంబంధించిన పనులు వేగమందుకున్నాయి.
అదెంతన్న విషయంలోకి వెళితే.. ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే.. డీ బ్లాక్ లోని ఐటీ శాఖ సర్వర్ ను బీఆర్కే భవన్ కు తరలించారు. అంతేకాదు.. మీడియా పాయింట్ ను సైతం ఖాళీ చేయించారు. ఏళ్ల తరబడి సచివాలయంలో పడి ఉన్న వాహనాల్ని తరలించారు. వందకుపైగా కార్లు.. పలు జీపులు.. ఆటోలు.. టూవీలర్లను నిజాం కాలేజీ కి తరలించారు. అక్కడ బహిరంగ వేలం తో వాటిని అమ్మేయనున్నారు.
ఈ పనులు ఒకపక్క సాగుతూనే ఉండగా.. సచివాలయాన్ని వీలైనంత వేగంగా కూల్చేసేందుకు అవకాశం ఉన్న సాంకేతిక అంశాల పై ఫోకస్ పెట్టారు. తక్కువ సమయంలో.. ఎక్కువ సమస్యలు చోటు చేసుకోకుండా ఉండేలా భవనాల్ని కుప్ప కూల్చే అత్యాధునిక మార్గాలు ఏమున్నాయన్న విషయంపై ఐదారు కంపెనీలతో సంప్రదింపులు జరిపారు కూడా. ఇందులో భాగంగా.. కిటికీలు.. తలుపుల్ని తొలగించటం మొదలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు లోపు భవనాల్ని కూల్చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్న సర్కారును చూస్తే.. అధినేత అనుకోవాలే కానీ జరగని పనులేం ఉంటాయన్న భావన కలుగక మానదు.