Begin typing your search above and press return to search.

కూల్చివేతకు అంత కసరత్తు జరుగుతోంది

By:  Tupaki Desk   |   1 July 2020 5:30 AM GMT
కూల్చివేతకు అంత కసరత్తు జరుగుతోంది
X
తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి అయ్యే వరకు విషయాన్ని వదిలిపెట్టకుండా ఉండే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. కారణం ఏదైనా కానీ తన హయాంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని డిసైడ్ చేయటం జరిగినా.. కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ ఆగింది. తాజాగా తెలంగాణ సచివాలయాన్ని కూల్చేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వటం తెలిసిందే. తాను అనుకున్న పనికి న్యాయచిక్కులు తొలిగిపోవటంతో.. సచివాలయాన్ని ఎలా కూల్చాలన్న అసలు పనిని తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ అవసరాల్ని గుర్తించిన కొన్ని సంస్థలు.. సచివాలయాన్ని అత్యాధునిక పద్దతుల్లో కూలుస్తామంటూ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలా వచ్చిన సంస్థలు దాదాపు పదికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. సచివాలయాన్ని తాము ఏ రీతిలో కూలుస్తామన్న విషయంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పనులు త్వరగా పూర్తి చేయాలని.. అందుకే తక్కువ సమయంలో.. సురక్షిత పద్దతిలో సచివాలయాన్ని కూల్చే సాంకేతికతను వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. శ్రావణ మాసంలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు వీలుగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

సచివాలయ భవనాల్ని కూల్చే సమయంలో చుట్టు పక్కల ఉన్న వారికి మాత్రమే కాదు.. దగ్గర్లోని రహదారుల్లో వెళ్లే వారికి సైతం ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెబుతున్నారు. భవనాల్లోని డోర్లు..కిటికీలు.. ఫ్రేములను తొలుత తొలగిస్తారని.. ఆ తర్వాత సౌండ్ ఫ్రూఫ్ టెక్నాలజీ తో కూల్చేస్తారని చెబుతున్నారు. పాతిక ఎకరాల విస్తీర్ణం లో ఉన్న పలు భవనాల కూల్చి వేతకు పెద్ద ఎత్తున కసరత్తు సాగుతోంది. కొత్త సచివాలయాన్ని కేసీఆర్ అభి రుచి కి తగ్గట్లు రూ.500 కోట్లతో నిర్మించనున్నారు. ఆసక్తి కరమైన విషయం ఏమంటే.. కూల్చి వేతకు ఎంత ఖర్చు చేస్తున్నారన్న విషయం మాత్రం బయటకు రాలేదు.