Begin typing your search above and press return to search.
ఏంచెప్పలేకే వాయిదా అడుగుతున్నారా?
By: Tupaki Desk | 22 Sep 2015 6:52 AM GMTముందు వెనుకా చూసుకోకుండా ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లు ఉంది. చేతిలో పవర్ ఉంటే.. ఏమైనా చేయొచ్చన్నది సరి కాదని.. స్పీడ్ కు బ్రేకులు వేయటానికి చాలానే అంశాలు ఉంటాయన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
దీనికి తగ్గట్లే కొన్ని అంశాల విషయంలో ఏం సమాధానం చెప్పలేక.. మౌనంగా ఉంటూ.. వాయిదాల మీద వాయిదాలు కోరుతూ కాలం గడుపుతున్నారన్న ఆరోపణ తెలంగాణ సర్కారు మీద వినిపిస్తోంది.
ప్రభుత్వ సలహాదారులు.. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు.. కార్పొరేషన్ ఛైర్మన్ లకు ఇచ్చిన క్యాబినెట్ హోదాపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ సర్కారు సమాధానం చెప్పలేకపోతుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఇచ్చేస్తున్నారని.. ఈ విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఇప్పటికే పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ వాదన వినిపించాలని కోరింది. అయితే.. గత నాలుగు వాయిదాలకు తెలంగాణ సర్కారు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ప్రతి వాయిదాకు మరో వాయిదా ఇవ్వాలని కోరటం తప్పించి.. తన వాదనను వినిపించని పరిస్థితి. దీనిపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
నాలుగు దఫాలుగా వాయిదాలు కోరటమే తప్పించి.. వాదనలు వినిపించరేమంటూ సూటిగా ప్రశ్నించిన హైకోర్టు.. ఈసారి మాత్రం వాయిదా కోరితే.. ప్రతి వాయిదాకు రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ వాయిదా వేసింది. చెప్పేందుకు సమాధానం లేకనే.. వాయిదాలు కోరుతుందన్న మాట న్యాయవాద వర్గాల్లో వినిపిస్తోంది. మరి.. తదుపరి వాయిదాకు అయినా తెలంగాణ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో..?