Begin typing your search above and press return to search.

తెలంగాణలోనూ డిమాండ్ చేయనున్నారా?

By:  Tupaki Desk   |   28 Aug 2015 11:00 AM GMT
తెలంగాణలోనూ డిమాండ్ చేయనున్నారా?
X
నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాలో భాగంగా కానీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాని బదులు కానీ ప్రత్యేక గ్రాంటు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇది ఇవ్వడం ఖాయమైనా అది 70 శాతమా? 80 శాతమా? 90 శాతమా అనే చర్చ జరుగుతోంది. అధికారులు తర్జన భర్జన లు పడుతున్నారు. ఇది తేలితే అతి త్వరలోనే గ్రాంటు విషయం తేలుతుంది. ఇది వస్తే.. ప్రపంచ బ్యాంకు సహా విదేశీ సంస్థలు ఇచ్చే రుణంలో వెసులుబాటు వస్తుంది. కేంద్రం ఎంత శాతం గ్రాంటు ఇస్తే అంత శాతం రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు.

భవిష్యత్తులో నవ్యాంధ్రకు కేంద్రం గ్రాంటు ఇచ్చినప్పుడు ఎదురు దాడి, వెనకబాటు వ్యూహంతో తెలంగాణకు కూడా గ్రాంటు కోరాలనే కసరత్తులో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆర్థిక శాఖ అధికారులు వివరిస్తున్నారు. నవ్యాంధ్రకు గ్రాంటు ఇస్తే అంత లేదా అందులో కొంత అయినా గ్రాంటు ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ బ్యాంకు రుణంపై ప్రతిపాదనలు తయారు చేశారని వివరిస్తున్నారు. ఏకంగా లక్షా 50 వేల కోట్ల రూపాయల రుణం కావాలని తెలంగాణ ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదించింది. అయితే తాము అంత ఇవ్వలేమిన చెబితే దానిని 60 వేల కోట్లకు కుదించింది. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. కనక కేంద్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల అవసరాలు చూసుకుని తర్వాత స్పందిస్తామని చెప్పి తప్పకుంది. అయితే, ఇప్పుడు బీజేపీ నేతలపైనా కేంద్రంపైనా ఎదురు దాడి మొదలు కానుందని, ప్రపంచ బ్యాంకు రుణంతోపాటు గ్రాంటుపైనా డిమాండ్ చేయడానికి తెలంగాణ సర్కారుసిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ అధికారులు వివరిస్తున్నారు.