Begin typing your search above and press return to search.
రూ.1500కోట్లు ఏమయ్యాయి..?
By: Tupaki Desk | 2 Sep 2015 6:03 AM GMTఆ మధ్యన తెలంగాణ ఖాతాకు చెందిన రూ.1274కోట్లను ఐటీ శాఖ బదలాయించుకోవటం.. దీనిపై తెలంగాణ సర్కారు గళం విప్పి.. వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నించి.. కేంద్రంతో కోట్లాడి మరి.. తన నుంచి తీసుకున్న రూ.1274కోట్ల భారీ మొత్తాన్ని ఎట్టకేలకు తీసుకురాగలిగింది. మూడు నెలల పోరాటం అనంతరం మంగళవారం.. ఈ భారీ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఖాతాలో జమ అయ్యింది.
ఇదిలా ఉంటే.. ఆసక్తికలిగించే అంశం ఒకటుంది. మూడు నెలల కిందట.. రిజర్వ్ బ్యాంకు దగ్గరున్న తెలంగాణ రాష్ట్ర ఖాతాలో రూ.3500 కోట్లు ఉన్నాయి. దీంతో.. తమకు రావాల్సిన బకాయిల్ని తిరిగి తీసుకునేందుకు ఆర్ బీఐ అనుమతితో ఐటీ శాఖ ఈ నిధులను బదలాయించుకోవటం తెలిసిందే. తాజాగా తెలంగాణ సర్కారు ఖాతాలో తాను తీసుకున్న రూ.1274కోట్లను జమ చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఖాతాలో మొత్తంగా ఉన్న నగదు నిల్వ రూ.2వేల కోట్లు మాత్రమేనని చెబుతున్నారు.
అంటే.. మూడు నెలల క్రితం.. ఐటీ శాఖ రూ.1274కోట్లు తీసుకునే సమయంలో తెలంగాణ సర్కారు ఖాతాలో రూ.3500కోట్లు ఉంటే.. తాజాగా మాత్రం ఈ భారీ మొత్తాన్ని వేసిన తర్వాత రూ.2వేల కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే.. మూడు నెలల వ్యవధిలో రూ.1500 కోట్ల నిధుల తరుగుబాటు చోటు చేసుకుందన్న మాట. ఈ విషయాన్ని మరింత సింఫుల్ గా చెప్పాలంటే.. మూడు నెలల క్రితం మీ పర్సులో రూ.వంద ఉన్నాయనుకుంటే.. అందులో చెప్పాపెట్టకుండా యాభై రూపాయిలు మీ స్నేహితుడు తీసుకున్నాడనుకోండి. మీరు వాడిని చడామడా తిట్టేసి.. చివరకు మీ యాభై మీరు తెచ్చేసుకున్నారు. అంటే.. అప్పుడు మీ జేబులో ఉండాల్సింది రూ.వంద.
కానీ.. మీ జేబులో రూ.70 ముత్రమే ఉంటే దాని అర్థం ఏమిటి? మీ జేబులో ఉండే నగదు నిల్వ తగ్గిపోయిందని. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ సర్కారుకు చెందిన ఆర్ బీఐ ఖాతాలో భారీ మొత్తం తరుగు కనిపించటం విశేషం. ఓ పక్క ఏడాపెడా అప్పులు తెస్తూనే.. మరోవైపు ఖాతాలో ఉన్న నగదు ఖర్చు అయిపోవటం చూసినప్పుడు.. నగదు నిల్వపై తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపించదు. ధనిక రాష్ట్రమని తరచూ చెప్పుకోవటం కంటే కూడా ధనిక రాష్ట్రానికి ఉండే ధనబలం తెలంగాణ రాష్ట్రానికి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.