Begin typing your search above and press return to search.
తెలంగాణలో కలెక్టర్లను బంతాట ఆడుకుంటున్నారా?
By: Tupaki Desk | 4 Feb 2020 4:51 AM GMTఅరుదుగా మీడియా సమావేశాల్ని ఏర్పాటు చేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కనీసం గంట నుంచి రెండు గంటల పాటు మాట్లాడటం.. ఆ సందర్భంగా అన్ని అంశాల్ని ప్రస్తావించటం చేస్తుంటారు. పాలనాపరమైన లోపాలకు సంబంధించిన అంశాలు ప్రశ్నల రూపంలో వస్తే.. ఘాటుగా రియాక్ట్ కావటమే కాదు.. ఆ సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు వింటే.. సీఎం అంటే ఇలానే ఉండాలి బాస్ అన్నట్లు ఉంటాయి. చట్టాన్ని కరకుగా అమలు చేయాలని.. అక్రమార్కులకు తొడపాశం పెట్టాలన్న మాటనే కాదు.. అవినీతి.. అక్రమాల మీద ఆయన మాటలు విస్మయానికి గురి చేస్తుంటాయి. పైసల కక్కుర్తి పోదా? ఎంత సంపాదిస్తే ఏం చేస్తారంటూ మాటలు విసురుతుంటారు.
మరిన్ని మాటలు చెప్పే కేసీఆర్ వ్యాఖ్యలకు తగ్గట్లే పాలన ఉందా? అంటే క్వశ్చన్ మార్కే. తాజాగా బయటకు వచ్చిన ఒక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక జిల్లాకు కలెక్టర్ గా నియమించిన తర్వాత.. కేవలం 40 రోజుల వ్యవధిలో నలుగురు కలెక్టర్లను మార్చటం సాధ్యమవుతుందా? అంటే ఉండదనే చెబుతారు. కానీ.. అలాంటి విచిత్రం తమ హయాంలోనే సాధ్యమన్న విషయం కేసీఆర్ పాలనలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.
మేడారం జాతర ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటి భారీ వేడుక కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్ల వరకూ డెవలప్ మెంట్ పనుల్ని చేయిస్తోంది. జాతర ఇంకా మొదలు కానప్పటికీ.. పనులు మొదలైననాటి నుంచి ఒక్కొక్క కలెక్టర్ రావటం.. వెంటనే వెళ్లిపోవటం.. మరొకరు రావటం వెళ్లిపోవటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. కేవలం నలభైరోజుల వ్యవధిలో నలుగురు కలెక్టర్లు బదిలీ కావటం.. ఒక చిన్న జిల్లాలో ఇంత భారీగా మార్పులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
డెవలప్ మెంట్ పనుల్ని తమ సొంతం చేసుకునే విషయంలో గులాబీ నేతల ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగకున్నా సరే.. రాజకీయ అస్త్రాన్ని బయటకు తీసి వారిపై బదిలీ వేటు వేస్తున్నారని.. ఈ కారణంతోనే స్వల్ప వ్యవధిలో ములుగు జిల్లాకు నలుగురు కలెక్టర్లు మారినట్లుగా చెబుతున్నారు. బలమైన కారణం లేకుండా కలెక్టర్లను మార్చరు. మరి.. నీతులు చెప్పే కేసీఆర్ సర్కారు హయాంలో కలెక్టర్లను బంతాట ఆడినట్లుగా ఆడేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తేలా నలభై రోజుల్లో నలుగురు కలెక్టర్లను బదిలీ చేసిన వ్యవహారం మారిందన్న మాట వినిపిస్తోంది. పాలన విషయంలో ఎంత కఠినంగా ఉండాలో తరచూ చెప్పే కేసీఆర్ సాబ్ హయాంలోనే ఇలాంటివి చోటు చేసుకోవటం ఏమిటంటారా?