Begin typing your search above and press return to search.
పాస్ పోర్టును తలదన్నే టెక్నాలజీతో కేసీఆర్ కలల ప్రాజెక్టు
By: Tupaki Desk | 12 Feb 2018 6:16 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన కలల ప్రాజెక్టుకు అనూహ్యమైన టెక్నాలజీని జోడిస్తున్నారు. హైదరాబాద్ నిజాం తర్వాత భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి...పట్టాదార్ పాస్ పుస్తకాలు అందిస్తున్న కేసీఆర్ ఇందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పాస్ పోర్ట్ తో సమానమైన సాంకేతికతను తన డ్రీమ్ ప్రాజెక్టుకు జోడిస్తున్నారు. రాష్ట్రంలోని కోటి 40 లక్షల ఎకరాల సాగుకు గాను యోగ్యమైన భూములకు 70 లక్షల పాస్ పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేయిస్తోంది.
రాష్ట్రంలోని రైతులకు అందించనున్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. మార్చి 11వ తేది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెక్యూరిటీ ప్రెస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో నాలుగు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లలో వీటి ముద్రణ జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో ఉన్న ప్రెస్ తో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ - మహారాష్ట్రలోని నాసిక్ - ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా ప్రెస్ లలో వీటి ముద్రణకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం కుదిరింది.
18 భద్రతా ప్రమాణాలతో - ఇండియన్ పాస్ పోర్టు తరహాలో ముదురు ఆకుపచ్చ రంగులో మొత్తం ఆరు కాలమ్స్‌తో 20 పేజీలుగా పట్టాదారు పాస్ పుస్తకం రూపొందుతోంది. మొత్తం 13 డిజిట్ల యునిక్ ఐడితో రాష్ట్రం - గ్రామం - మండలం - జిల్లా కోడ్ తో పాటు పాస్ బుక్ నెంబర్ ను ముద్రిస్తున్నారు. యునిక్ ఐడిలోని ఆరవ స్థానంలో జిల్లాను (ఉదాహరణకు రంగారెడ్డి అంటే ఆర్ గా) సూచించే విధంగా ఆ జిల్లా పేరులోని మొదటి ఇంగ్లీషు అక్షరాన్ని ప్రచురిస్తున్నారు. ఆధార్ అనుసంధానంతో పాస్ పుస్తకంపై బార్ కోడ్ - క్యూఆర్ కోడ్ - పట్టాదారుడి చేతి వేలిముద్ర - ఫోటో ఉంటాయి. పాస్ బుక్ లో పట్టాదారుడి మొబైల్ నెంబరు - బ్యాంకు ఖాతా నెంబరు - బ్యాంకు యొక్క ఐఎఫ్ ఎస్ సి కోడ్ ఇతర బ్యాంకు శాఖ వివరాలుంటాయి. భూమి హద్దు ల(బౌండరీస్)తో కూడిన పట్టాదారు సాగుచేసే భూమి మ్యాప్ - లావాదేవీల క్రయ విక్రయాల వివరాలు ఉంటాయి. ప్రభుత్వం చేపట్టిన భూసర్వేలో పట్టాదారు పాస్ పుస్తకం కోసం పక్కా గణాంకాలు - భూయజమానుల ఫోటోలు - ఆధార్ వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ భూమి యాజమాన్యపు హక్కు పత్రం - పట్టాదారు పాస్ పుస్తకం గురించి ముఖ్య సూచనలు పొందుపరుస్తున్నారు.