Begin typing your search above and press return to search.
ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్...టీ.సర్కార్ వాదన ఇదే
By: Tupaki Desk | 24 Dec 2018 10:31 AM GMTసినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ విషయంలో ఆసక్తికర పరిణామాలు కొనసాగుతున్నాయి. ప్రభాస్ గెస్ట్ హౌస్ ను ఇటీవల అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తను గెస్ట్ హౌస్ నిర్మించుకున్న స్థలాన్ని చట్టబద్ధంగా కొన్నానని..రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ స్థలంలోని తన బిల్డింగ్ కి సంబంధించి ఆస్తి పన్ను - విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నానని..ఎటువంటి వివాదాలు లేకపోయినా, తాను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నానని, రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ కోరుతున్న క్రమంలో రెవెన్యూ అధికారులు వేసిన కౌంటర్ తో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
తాజాగా ప్రభాస్ తన స్థల వివాదంపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు కౌంటర్ పిటీషన్ వేశారు. ప్రభాస్ గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించేదననీ - అందుకే తాము సీజ్ చేశామని నేడు హైకోర్ట్ లో కౌంటర్ పిటీషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గం సమీపంలో సర్వే నంబర్ 5/3లో ప్రభాస్ కు చెందిన 2,083 చదరపు అడుగుల స్థలాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని చెబుతూ..దానికి తగిన కారణాలను తమ పిటిషన్ లో రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ పిటీషన్ ను విచారణకు తీసుకున్న ధర్మాసనం డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేసింది. ప్రభాస్ తన స్థల వివాదంపై మరిన్ని వివరాలను కోర్టుకు సమర్పించాల్సిన అవసరముంది. వాటి ఆధారంగా తుది నిర్ణయం వెలువడనుంది.