Begin typing your search above and press return to search.
‘నంది’ స్థానే తెలంగాణ మార్క్ అవార్డులు
By: Tupaki Desk | 5 Nov 2016 5:23 AM GMTతెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించి పురస్కారాలు ఇచ్చే విషయంలో ‘నంది’ పేరిట అవార్డులు ఇవ్వటం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో నంది అవార్డుల్ని ఇవ్వటం ఆపేశారు. ఈ అవార్డుల్ని ఎలా ఇవ్వాలన్న అంశంపై పలు దఫాలు చర్చలు జరిగాయి. ఒకదశలో నంది అవార్డుల్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని భావించింది. దీనికి సంబంధించిన చర్చ జరిగినప్పటికీ.. ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏది ఏమైనా.. నంది అవార్డుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి అవార్డులు ఇవ్వటం సాధ్యం కాదని తేలిపోయింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తనకు తాను అవార్డులు ఇవ్వాలని తేల్చేసింది. అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్లుగా నంది పేరిట కాకుండా వేరేగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. 2014 జూన్ రెండు నుంచి 2015 డిసెంబరువరకు తెలంగాణలో నిర్మించిన చలన చిత్రాలకు కలిపి పురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పేర్కొంది.
ఇక.. 2016 జనవరి నుంచి డిసెంబరువరకు నిర్మించే సినిమాలకు వచ్చే ఏడాది పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక.. అవార్డులను సైతం తెలంగాణ ప్రముఖుల పేరిట ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పురస్కారాల కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించారు. తాజాగా ఇవ్వాలని భావించి.. ప్రభుత్వానికి సిఫార్సు చేసిన అంశాల్ని చూస్తే..
= తెలంగాణకు చెందిన చలనచిత్ర ప్రముఖునికి కాంతారావు పేరిట పురస్కారం
= జాతీయ స్థాయి ప్రముఖునికి పైడి జయరాజు పేరిట అవార్డు
= ఉత్తమ కుటుంబ చిత్రానికి ప్రభాకర్ రెడ్డి పురస్కారం
= ఉత్తమ గేయ రచయితకు దాశరథి పేరిట పురస్కారం
= ఉత్తమ సంగీత దర్శకునికి చక్రి పేరి అవార్డు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/