Begin typing your search above and press return to search.
జనహిత... కేసీఆర్ కొత్త ఐడియానా?
By: Tupaki Desk | 28 Jan 2018 5:20 AM GMTతనదైన శైలిలో అనూహ్య - సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు పెట్టింది పేరయిన టీఆర్ ఎస్ పార్టీ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రభుత్వం ప్రజల చెంతకు పాలనను తీసుకెళ్లేందుకు మరో విప్లవాత్మక సౌలభ్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. సమస్యల పరిష్కారానికి క్యూలో నిల్చొని దరఖాస్తు చేసుకొనే అవసరం లేకుండా..ఫొటో లేదా ఫోన్‌కాల్‌తో ఇబ్బందిని తెలియజెప్పే విప్లవాత్మక ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. దాని పేరే జనహిత.
ప్రస్తుతం ప్రజలు తమకున్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్లకు వెళ్తున్నారు. ఇందులో క్యూలైన్లలో నిల్చొని దరఖాస్తు చేయడం - సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటాన్ని గుర్తించింది. కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం - కొన్ని సందర్భాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయా ఫిర్యాదులను ఫాలోఅప్ చేయలేకపోవడం వంటి కారణాల వల్ల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. పైగా ఒక్కరోజే దరఖాస్తులు స్వీకరించడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనహిత పేరుతో ఆన్ లైన్లో ఫిర్యాదుల వేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో జనహిత పథకం సిద్ధమవుతోంది.
గత ఏడాది సూర్యాపేట - సిద్దిపేట - కామారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ప్రతిరోజూ దరఖాస్తులు స్వీకరించి, సమగ్రంగా పరిశీలించి, పరిష్కారం చూపేందుకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేస్తున్నారు. ఎస్సెమ్మెస్ - ఈమెయిల్ - వాట్సాప్ వంటి రూపాల్లోనే కాకుండా.. ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదిదారులకు గ్రీవెన్స్ యూనిక్ నంబర్ (గన్) పేరుతో ప్రత్యేక నంబరును కేటాయిస్తారు. ఈ విశిష్ట సంఖ్య ఆధారంగా సదరు ఫిర్యాదును ఉన్నతాధికారులు మానిటర్ చేస్తుంటారు. సమస్య పరిష్కారమయ్యేవరకు చర్యలు తీసుకొంటారు. వేగంగా సమస్యలు పరిష్కరించిన అధికారులకు ప్రత్యేక రివార్డులిస్తారు. సమస్య పరిష్కారంలో జాప్యానికి కారణమైనవారికి నెగటివ్ మార్కులు వేస్తారు. కేవలం ఫిర్యాదులు స్వీకరించడం మాత్రమే కాకుండా.. వివిధ రకాల సంక్షేమ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఈ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. తద్వారా అర్హులకు మరింత సమాచారం చేరవేస్తుంటారు.