Begin typing your search above and press return to search.
హైదరాబాద్ భూముల రేట్లు అలా పెంచుతారా?
By: Tupaki Desk | 25 Jun 2015 8:34 AM GMTహైదరాబాద్‌లో భూముల ధరలు మరింత పెరగనున్నాయి. అయితే.. పెంపు కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టటం దీనికో కారణం. మార్కెట్ అంత అనుకూలంగా లేప్పటికీ.. స్టాంపులు.. రిజిస్ట్రేషన్ల శాఖభూముల ధరల్ని పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనల్ని చేసింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతంలో కనిష్ఠంగా పది శాతం నుంచి గరిష్ఠంగా 70 శాతం వరకు పెంచే ఆలోచనల్ని ప్రభుత్వం ముందు అధికారులు ఉంచారు. భూముల ధరలకు సంబంధించి మార్కెట్ రేటుకు.. ప్రభుత్వ విలువకు మధ్య వ్యత్యాసం ఉందని.. దాన్ని తగ్గించుకునేందుకు భూమల విలువను పెంచటం తప్పనిసరి అని చెబుతున్నారు.
మరోవైపు భూముల విలువ పెంపుతో రియల్ రంగం మరింత ఊపునిస్తుందని చెప్పినా.. ఈ విలువ పెంపు అంతిమంగా సామాన్యుడికి భారంగా మారటం ఖాయం. భూముల విలువను ప్రభుత్వం పెంచటం కనుక ఖాయమైతే.. ఆ వెంటనే అందుకు అనుగుణంగా మార్కెట్ ధరలు కూడా పెరుగుతాయి. భూముల ధరలు పెరిగితే.. నిర్మాణ ఖర్చుల్లో అది భాగస్వామ్యం కావటంతో.. నిర్మాణ రంగంపై ప్రభావం చూపిస్తుందని.. అంతిమంగా ఇది భారంతగా మారుతుందన్న వాదన వినిపిస్తుంటే.. ప్రభుత్వమే ఆస్తుల విలువ పెంచుతున్న నేపథ్యంలో.. పెట్టుబడులు పెట్టటానికి.. పలువురు హైదరాబాద్ మీద దృష్టి సారించటానికి అనుకూలాంశంగా మారుతుందన్న వాదనలు ఉన్నాయి.
మొత్తంగా అధికారులు సిద్ధం చేసిన భూమి విలువ ప్రతిపాదనల్ని తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు ఆమోదిస్తుందో చూడాలి. బంజారాహిల్స్‌లోని 15 ఏరియాలకు పది ఏరియాల్లో మాత్రమే భూమి విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా చిక్కడపల్లి.. సికిందాబాద్.. అబిడ్స్.. ఉప్పల్ రింగురోడ్డు.. నాగోల్.. సరూర్‌నగర్.. వనస్థలిపురంలలో భూముల విలువను 10 నుంచి 20 శాతం మధ్య పెంచాలన్న ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.
ఇక.. గోల్కండ పరిధిలోని పలు ప్రాంతాల్లో 30నుంచి 50 శాతం మధ్యన భూముల విలువ పెంచాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పాతబస్తీలోని పలు ప్రాంతంలో ఈ పెంపు 50 శాతం వరకు ఉంటుందంటున్నారు. పెద్ద అంబర్‌పేట.. ఎల్బీనగర్.. కీసర తదితర ప్రాంతాల్లో అయితే ఈ భూముల విలువ పెంపు 50 నుంచి 70 శాతం మేర పెంచాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి.. అధికారుల ప్రతిపాదనల్ని తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు ఓకే చెబుతుందో చూడాలి.