Begin typing your search above and press return to search.
రూ.కోటి పుస్తకాలు తరలించేశారంట
By: Tupaki Desk | 5 July 2015 5:11 AM GMTపదో షెడ్యూల్‌కు సంబంధించిన ఆస్తుల మీద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ ఒక కొలిక్కి వచ్చింది లేదు. ఇక.. హైదరాబాద్‌లో ఉన్న అంబేడ్కర్.. తెలుగు విశ్వవిద్యాలయాలు తమవేనని వాదిస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు.. తాజాగా తెలుగు వర్సిటీకి చెందిన ప్రాంతీయ అకాడమీలపై కర్రపెత్తనం చేస్తుందని ఆరోపిస్తున్నారు.
ప్రాంతీయ అకామీలకు సంబంధించిన ఆస్తుల్ని గుట్టుగా తరలిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకూ కోటి రూపాయిల మేర పుస్తకాల్ని తరలించారని.. ఇప్పుడు మరిన్ని పుస్తకాలు.. ర్యాకులు తరలించే పనికి పూనుకోవటంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.
విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలకు సంబంధించి పుస్తకాలు పంపాలని కోరుతుంటే స్పందించని అధికారులు.. తిరుపతిలో ఉన్న పుస్తకాల స్టాకును హైదరాబాద్ పంపేందుకు ప్రయత్నాలు షురూ చేయటం.. ఇప్పటికే రూ.కోటి మేర పుస్తకాల్ని పంపిన నేపథ్యంలో.. తాజాగా పంపుతున్న పుస్తకాల్ని అడ్డుకున్నారు. మరి.. ఈ పుస్తకాల తరలింపును అడ్డుకున్న అంశంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.