Begin typing your search above and press return to search.

చివ‌ర్లో టైం మార్చేశారు..జైపాల్ అంతిమ‌యాత్ర‌లో హ‌డావుడి!

By:  Tupaki Desk   |   29 July 2019 2:14 PM IST
చివ‌ర్లో టైం మార్చేశారు..జైపాల్ అంతిమ‌యాత్ర‌లో హ‌డావుడి!
X
ఏమైందో తెలీదు. కార‌ణం వివ‌రంగా చెప్ప‌లేదు. సందేహాల‌కు స‌మాధానం చెప్ప‌లేదు కానీ.. స‌ర్కారు సందేశం మాత్రం ఇదంటూ అధికారులు చెప్పిన మాట‌కు విస్తుపోవ‌టంమాజీ కేంద్ర‌ మంత్రి జైపాల్ రెడ్డి కుటుంబం వంతైంది. విలువ‌లున్న నేత‌గా.. ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు ఏ మాత్రం సూట్ కాని వ్య‌క్తిత్వం జైపాల్ సొంతం. తాను న‌మ్మిన విలువ‌ల‌కు ఒక్క అడుగు వెన‌క్కి వేయ‌టానికి సైతం ఆయ‌న ఒప్పుకునే వారు కాదు. అలాంటి ఆయ‌న మ‌ర‌ణం తెలంగాణ రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా లోటేన‌ని చెప్పాలి.

ఇప్పుడు న‌డుస్తున్న రాజ‌కీయ ప‌రిస్థితులపై హెచ్చ‌రించే పాత‌త‌రం నేత‌లు ఒక్కొక్క‌రుగా నిష్క్ర‌మిస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలోనైనా వారు పాటించిన విలువ‌ల గురించి చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైపాల్ రెడ్డి అంత్య‌క్రియ‌ల‌కు సంబంధించి చోటు చేసుకున్న ప‌రిణామాలు హాట్ టాపిక్ గా మారాయి.

తొలుత కుటుంబ స‌భ్యులు జైపాల్ అంత్య‌క్రియులు పీవీ ఘాట్ ప‌క్క‌న నిర్వ‌హించాల‌ని కోరారు. అందుకు భిన్నంగా అక్క‌డ కాకుండా.. దాని ప‌క్క‌నున్న మైదాన ప్రాంతంలో జ‌రిగేందుకు వీలుగా ప్ర‌భుత్వం ఒప్పుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

దీనికి త‌గ్గ‌ట్లే కాంగ్రెస్ నేత‌లు.. ప్ర‌భుత్వ అధికారులు అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేశారు. ప‌నులు ఊపందుకున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యం మారిందంటూ అధికారుల మాట‌లు విస్మ‌యానికి గురి చేశాయి. మ‌రింకేమీ చేయ‌లేక ప్ర‌భుత్వం పేర్కొన్న కూక‌ట్ ప‌ల్లి నాలా నుంచి హెలిప్యాడ్ వెళ్లే ప్రాంతాన్ని నిర్ణ‌యించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద రెండు గంట‌ల‌కు పైనే జైపాల్ రెడ్డి భౌతిక‌కాయాన్ని సంద‌ర్శ‌న కోసం ఉంచాల‌ని భావించినా.. ప్ర‌భుత్వం గంట‌కు మించి వ‌ద్ద‌ని.. షెడ్యూల్ ను మ‌రింత త‌గ్గించ‌టంతో అంతిమ‌యాత్ర‌లో హ‌డావుడి నెల‌కొంది. అంతిమ‌యాత్ర‌ను ముందుగా అనుకున్న‌ట్లు కాక‌.. స‌మ‌యాన్ని కుదించ‌టం ఎందుక‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. ఏమైనా.. భావోద్వేగాలు అధికంగా ఉండే వేళ‌లో.. అదేప‌నిగా మార్పులు చేయ‌టం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.